news

News March 30, 2024

పవన్ ‘వారాహి సభ’కు అనుమతి నిరాకరణ

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్‌‌కు పిఠాపురం పోలీసులు షాక్ ఇచ్చారు. ‘వారాహి’ సభకు అనుమతి నిరాకరించారు. వారాహి వాహనంపై నిల్చొని మాట్లాడొద్దని సూచించారు. నిర్ణీత సమయంలో వాహనం కోసం దరఖాస్తు చేసుకోనందుకే అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. చిన్నపాటి వాహనానికి అనుమతించారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2024

LSGలోకి న్యూజిలాండ్ ప్లేయర్

image

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో(LSG) జట్టు ప్లేయర్‌ను మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్న డేవిడ్ విల్లీ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్‌ను తీసుకుంది. రూ.1.25 కోట్ల బేస్ ప్రైజ్‌తో NZ బౌలర్ హెన్రీ లక్నో జట్టుతో చేరారు. గతంలో పంజాబ్ కింగ్స్, CSK జట్లలో భాగమైన హెన్రీ.. పంజాబ్ తరఫున మాత్రమే 2 మ్యాచ్‌లు ఆడారు.

News March 30, 2024

టెర్రరిస్ట్‌ను ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారిన యూట్యూబర్

image

అమెరికాకు చెందిన యూట్యూబర్ ఓ టెర్రరిస్ట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోయి బందీగా మారాడు. హైతీకి చెందిన గ్యాంగ్ లీడర్ బార్బెక్యూను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్ హైతీకి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే మరో గ్యాంగ్ అతడిని కిడ్నాప్ చేసి 6 లక్షల డాలర్లు డిమాండ్ చేసింది. కాగా అడిసన్‌కు యూట్యూబ్‌లో 1.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇతడు భయంకర ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు.

News March 30, 2024

అన్నం తినేవాళ్లు పార్టీ మారరు: కౌశిక్ రెడ్డి

image

TG: అన్నం తినే వారు ఎవరూ పార్టీ మారరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయన పార్టీని నమ్మించి గొంతు కోశారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ నేతలకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజం తెలుస్తుంది’ అని ఆయన మండిపడ్డారు.

News March 30, 2024

వడ్డీ రేట్లలో నో ఛేంజ్?

image

వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 5న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేటును యథాతథంగా (6.5%) కొనసాగించాలని RBI నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ధరల పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో RBI అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 5.1% నమోదు కాగా ఈనెల అది 5.2%కు పెరగొచ్చని అంచనా వేసింది.

News March 30, 2024

YCP ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100: బాబు

image

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటుందని ఆరోపించారు. ‘పేదలకు సాయం చేయాలని జగన్‌కు లేదు. ఈ ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదు. జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. వైసీపీని ఓడించేందుకు ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. మేం ఎప్పుడూ పేదల పక్షమే’ అని ఆయన పేర్కొన్నారు.

News March 30, 2024

హేమ మాలినిపై బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ

image

ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ చేయనున్నారు. మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హేమ బరిలోకి దిగగా.. విజేందర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే వరుసగా రెండుసార్లు మథుర ఎంపీగా గెలిచిన హేమపై విజేందర్ పైచేయి సాధిస్తాడా? లేదా అనేది చూడాలి.

News March 30, 2024

పాండ్యపై ద్వేషం సరికాదు: అశ్విన్

image

రోహిత్‌ స్థానంలో MI కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాండ్యపై అభిమానుల ద్వేషం సరికాదని భారత క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్లపై చేసే కామెంట్స్ చూస్తుంటే క్రికెట్‌లో నెలకొన్న ద్వేషపూరిత వాతావరణం తెలుస్తుంది. గంగూలీ కింద సచిన్ ఆడారు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురు కుంబ్లే కెప్టెన్సీలో.. మళ్లీ వాళ్లంతా ధోనీ సారథ్యంలో ఆడారు’ అని అశ్విన్ గుర్తు చేశారు.

News March 30, 2024

ALERT: ఇంట్లో ఉన్న ఆడవాళ్లే టార్గెట్!

image

భర్త ఆఫీస్‌కు వెళ్లాక, ఇంటి పని చేసుకొని కాసేపు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే ఆడవాళ్లే లక్ష్యంగా సైబర్ మోసాలు మొదలయ్యాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వల వేస్తున్నారు. ఫోన్‌తో ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయవచ్చని, నెలకు ₹20వేల వరకూ సంపాదించుకోవచ్చని ఆశ పెడుతున్నారు. ఇంటి ఖర్చులకైనా అవుతాయని నమ్మి చాలామంది మోసపోతున్నారు. ఇలాగే తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఓ మహిళ రూ.4.63లక్షలు పోగొట్టుకున్నారు. SHARE

News March 30, 2024

బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

image

ఎన్నికల్లో 400 సీట్ల బంపర్ మెజార్టీనే లక్ష్యంగా పెట్టుకున్న BJP తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఉన్నారు. ఈ 27 మంది సభ్యుల కమిటీలో అశ్వినీ వైష్ణవ్, స్మృతీ ఇరానీ మొదలైన కేంద్ర మంత్రులూ ఉన్నారు.