India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.

రేపు సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో జరగాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మార్పును గమనించాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని అన్నారు.

మెదక్ బీఆర్ఎస్ టౌన్ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసును రద్దు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అన్నారు. ఆంజనేయులుపై కేసును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు సూచనలు ఇచ్చి అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. అక్కన్నపేటకు చెందిన ముత్యం సత్యనారాయణ, వంశి అనే బాలుడిని ఈనెల 13న మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది, అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం రవాణా అక్రమ విక్రయం వంటి కార్యకలాపాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తాయన్నారు. అరికట్టడానికి పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్, స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ ఉషారాణి, జడ్చర్ల ఎంఈఓ మంజులా దేవి, SGF జిల్లా సెక్రటరీ డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పీడీలు వేణుగోపాల్, రామచందర్, రాములు, ముస్తఫా, కృష్ణ, మోహిన్, రవికుమార్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.