India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాందేడ్ డివిజన్‌లో రైల్వేలైన్ క్రాస్‌ఓవర్ కనెక్షన్ పనుల కారణంగా ఆదిలాబాద్ – నాందేడ్ రైలు (17409) ఆలస్యంగా నడవనుంది. ఈ నెల 15, 17, 18, 24, 25, 26 తేదీల్లో ఈ రైలు ఆలస్యంగా బయలుదేరుతుందని, మధ్యలో ఒక స్టేషన్‌లో ఎక్కువ సమయం ఆగుతుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

ఆదిలాబాద్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణానికి చెందిన గణేష్, గౌతం, ప్రశాంత్, మునీశ్వర్, మహేష్ ఎమ్మెల్యే పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారన్నారు. వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన పోస్టులు గొడవలకు దారి తీసేలా ఉండటంతో నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాజర్షి షా క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా, గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ప్రచురణపై ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై చర్చించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించమన్నారు.

ఆదిలాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని రూరల్ సెక్షన్, మావల, అదిలాబాద్ నార్త్, సౌత్ సెక్షన్, ఆదిలాబాద్ టౌన్-3 సెక్షన్‌ల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి దస్నపూర్ సబ్ స్టేషన్‌లో ఈ నెల 9న క్యాంప్ నిర్వహించనున్నట్లు టౌన్ సబ్ డివిజన్ అసిస్టెంట్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏవైనా విద్యుత్తు సమస్యలు ఉంటే విన్నవించి పరిష్కరించుకోవలన్నారు.

తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో(క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు వరద గేట్లు నుంచి సోమవారం రాత్రి ఎప్పుడైనా నీళ్లను వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. నదీ పరీవాహక (దిగువ) ప్రాంతంలోకి పశువులు గాని, గొర్రె కాపరులు, మత్సకారులు, రైతులు ఎవరూ వెళ్లవద్దని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీతో సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-26 కోసం జిల్లా సగటు దిగుబడిని ఖచ్చితంగా అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆదిలాబాద్‌లోని పంజాబ్ చౌక్ సమీపంలో పాత జాతీయ రహదారి పక్కన ఒక వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు మారుతి గతంలో తిర్పల్లిలోని హోటల్లో కార్మికునిగా పని చేసేవాడని సీఐ నాగరాజు తెలిపారు. మద్యానికి అలవాటు పడి తాగిన మత్తులో మృతి చెంది ఉంటాడన్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి భద్రపరిచామన్నారు. బంధువులు ఎవరైనా ఉంటే సంప్రదించాలన్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు తీరు, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై అధిష్టానంతో సుగుణ వివరించారు.

ఆదిలాబాద్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్, ఫిట్ లైన్, ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ కోరారు. ఈ మేరకు సోమవారం నాందేడ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రదీప్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జనగం సంతోష్, కార్యదర్శి సుభాష్, అమర్ జార్జ్ పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.