India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టకు పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వాహనదారుల రక్షణ కోసం స్పీడ్ బ్రేకర్లకు రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ పెయింటింగ్ వేయించారు. ప్రతి ప్రాణం విలువైనదని, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. భద్రతా చర్యలు చేపడుతున్న పోలీసుల పనితీరును ప్రజలు అభినందిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ అక్క కార్యక్రమం ప్రజల విశేష ఆదరణ పొందుతోంది. గత నెలలో 60 గ్రామాల్లో 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 45 పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. మొత్తం 25 ఫిర్యాదులు స్వీకరించి వేధింపులపై చర్యలు తీసుకున్నారు. చిన్నారుల సమాచారంతో 17 బాల్యవివాహాలు నిలిపివేశారు. ఉత్తమ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో పదో తరగతికి 4, ఇంటర్‌కు 3 కేంద్రాలు కేటాయించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉండాలని, తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాల రవాణా, భద్రతకోసం పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, విద్యార్థుల కోసం ఉదయం 7 నుండే బస్సులు నడపాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 21,000 విత్తన కిట్లను పంపిణీ చేస్తున్నామని, ఒక్కో కిట్ విలువ సుమారు రూ.500 ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. భూమి లేని వారు తేనెటీగల పెంపకం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నానో యూరియాను వినియోగించాలని సూచించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో డీసీసీబీ కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సహకార సంఘాల బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని వివరించారు. నానో యూరియా స్టాక్ అధిక మొత్తంలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ప్యాక్స్ పరిధిలో రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేని చోట ప్రత్యేక శ్రద్ధ వహించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.

నేరాల నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై డీఎస్పీ జీవన్ రెడ్డి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాల పరిశీలన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపడానికి నాకాబందీ కార్యక్రమం నిర్వహించామన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని హెచ్చరించారు. జిల్లాలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బహిరంగంగా పెట్రోల్ విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

జిల్లాలో ఎక్కడా ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1939ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకం పెంచే విధంగా విధుల నిర్వహణ జరగాలని, విధులను నీతి నిజాయితీలను తప్పనిసరి కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ లకు మధ్యవర్తుల ను రాకుండా నేరుగా బాధితులతో ఫిర్యాదులను స్వీకరించారని తెలిపారు. రౌడీ షీటర్ లను సస్పెక్ట్ షీటర్ లను తరచూ తనిఖీ చేస్తూ వారి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.