India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ADB రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న రిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని రిమ్స్ డైరెక్టర్ డా.జైసింగ్ రాథోడ్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు ఇతర వివరాలను rimsadilabad.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 1న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో అత్యధిక వర్షపాతం 105.8 mm వర్షపాతం నమోదయింది. ఆ తర్వాత ఇచ్చోడ లో 102.0mm, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరిలో 101.0mm వర్షపాతం నమోదయింది. ఈరోజు కూడా జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని.. ప్రజలు జాగ్రత్త వహించాలని వాతావరణ కేంద్రం తెలిపింది.

జిల్లాలో 1,378 మండపాల్లో వినాయకులు కొలువై ఉన్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో ఎక్కువగా 7, 9 రోజుల్లో నిమజ్జనాలు చేపడతారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు విద్యుత్ అధికారులు కీలక సూచనలు చేశారు. శోభాయాత్ర మార్గంలో కేబుల్, విద్యుత్తు తీగలు లూస్ లేదా కిందకి వేలాడుతూ ఉంటే స్థానిక విద్యుత్ అధికారులకు తెలియజేస్తే వాటిని సరిచేయడం లేదా తొలగించడం చేస్తారన్నారు. విద్యుత్తు తీగల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.

పోలీసు ప్రజల సత్సంబంధాలు మెరుగుపరచడానికి పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను ఎస్పీ ప్రత్యేకంగా దర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించి గణనాథుని సేవలో పాల్గొన్నారు. మండప కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడి నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు.

మహిళల భద్రతకై రక్షణకు ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ నెలలో షీ టీం బృందాల ద్వారా 3 ఎఫ్ఐఆర్ కేసులు, 18 ఈ పెట్టీ కేసుల నమోదు చేసిందని పేర్కొన్నారు.

వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలన్నీ సమగ్ర సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించనున్నట్లు చెప్పారు.

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదివారం జిల్లా క్రీడాకారిణి సత్తా చాటింది. అండర్ 20 విభాగంలో అశ్విని హైజంప్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుందని శిక్షకుడు రాకేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం పట్ల డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తదితరులు ఆమెను అభినందించారు.

ఏఎస్ఐ ఎస్.దిలీప్ (తాంసి, పీఎస్), ఏఎస్ఐ ముంతాజ్ అహ్మద్ (భీంపూర్ పీఎస్) పదవీ విరమణ పొందిన సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వారిని సన్మానించారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సర్వీసులో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇద్దరూ అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఏఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

HYDలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ సంబరాల్లో ఆదివారం బాలకేంద్రం చిన్నారులు పాల్గొన్నారు. ఎల్లమ్మ బోనాల పాటపై నృత్య ప్రదర్శన చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు నిర్వాహకులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం అన్ రిజర్వుడు టీఓడీ ప్రత్యేక రైలును చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆదిలాబాద్‌కు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో రాత్రి 8:10 నిమిషాలకు రైలు బయలుదేరి సోమవారం ఉదయం 6:15 నిమిషాలకు అదిలాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.
Sorry, no posts matched your criteria.