India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సంబంధిత హెచ్.ఓ.డిలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

విద్యార్థులకు అందించే భోజన నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కొత్త మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సకాలంలో అందించాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పెంచిన రేట్ల ప్రకారం సరుకుల సరఫరా సక్రమంగా ఉండాలన్నారు. ప్రత్యేక అధికారులు వారానికి కనీసం రెండుసార్లు అధికారులు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్పష్టం చేశారు.

ప్రజావాణి పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో మొత్తం 93 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణి (CPGRAMS) ద్వారా అందే ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని, మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు దిగిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు దిగిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.

నార్నూర్ మండలంలోని మాలేపూర్‌లో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్‌కు చెందిన బాలాజీ తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశారు. దాని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వం రాయితీపై గృహ అవసరాలకు అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.

గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.