India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్‌పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్‌కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.
ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు DEO ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ADBజిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేస్తామని CM రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. కానీ అంతకుముందు ADB-ARMR రైల్వేలైన్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ADB నుంచి NRML, ARMR, NZBకు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అయితే రైల్వేలైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు AIRPORT తెస్తామంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ADBలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
తాంసి గ్రామానికి చెందిన జానకొండ అశోక్ గ్రూప్-3 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్-1లో 399 మార్కులు, గ్రూప్-2లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-3లో 284 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 417వ ర్యాంక్ సాధించాడు. వరుసగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్న అశోక్ ప్రస్తుతం జైనథ్ మండలంలో చాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
భీంపూర్ మండలం అర్లీ(T) గ్రామానికి చెందిన రామెల్లి శివ గ్రూప్-3లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 481 ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 319 ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని శివ పేర్కొన్నారు.
నిరుద్యోగ బీసీ యువత కోసం బీసీ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఉచిత హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. HYD హకీంపేట్‌లో శిక్షణ ఉంటుందని, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో సమర్పించాలన్నారు.
2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO కీర్తి తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై శనివారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6,7,8తో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.
భద్రాచలంలో ఏప్రిల్ 6న నిర్వహించనున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి వెళ్ళని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్ తెలిపారు. ఒక ప్యాకెట్‌కి రూ.151 చెల్లించి ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ తలంబ్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కార్గో కౌంటర్లు ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.