Adilabad

News March 15, 2025

ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

image

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.

News March 15, 2025

ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

image

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.

News March 15, 2025

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

News March 15, 2025

ఆదిలాబాద్ జిల్లాలో కత్తి పోట్ల కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం గూడ రాంపూర్‌లో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా కత్తి పోట్లకు గురయ్యాడు. ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తాగిన మత్తులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.

News March 15, 2025

గ్రూప్‌-3లో బజార్హత్నూర్ వాసికి 74వ ర్యాంక్

image

గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్‌-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.

News March 15, 2025

ADB: రేపే ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 15, 2025

జైనథ్: 2 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అశోక్

image

జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన దుర్ల అశోక్ కుమారుడు అవినాశ్ శుక్రవారం విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో ఎంపికయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ఉద్యోగం సాధించారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటు ప్రిపేర్ అయినట్లు అవినాశ్ తెలిపారు. ఉద్యోగం సాధించడం పట్ల ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేశ్ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

News March 15, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి ADB జిల్లా జట్టు

image

ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు గొప్ప క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.

News March 15, 2025

ADB: ‘రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి’

image

ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్.ఓలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్‌లు ఏర్పాటు చేసి UPDATES అందించాలన్నారు.

News March 14, 2025

ఆదిలాబాద్: PHOTO OF THE DAY

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.

error: Content is protected !!