India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఏలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్‌కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే
ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. విద్యార్థులు ఈ నెల 7 నుంచి ఆన్లైన్‌లో హాల్ టికెట్‌లను దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అనుమతి లేని లే అవుట్ క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు హెల్ప్ డెస్క్‌ను కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సందేహాలు ఉన్నవారు సెల్ ఫోన్ 8309959444 నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25శాతం రిబేట్ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం ధరల్లో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ప్రత్యేక సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. కాగా జనవరి 31న నాగోబా జాతర సందర్భంగా పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించగా.. ఇవాళ రెండో శనివారం జిల్లాలోని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.