India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిరికోండలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివరాం వివరాల ప్రకారం.. తుమ్మలపాడ్ గ్రామానికి చెందిన విలాస్(28) ఇంటి గోడకున్నా విద్యుత్ వైర్ షాక్ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విలాస్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
ADB కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత మండలాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. 17 మండలాల్లోని 17 గ్రామపంచాయితీల్లో ఎంపికైన 2,148 ఇళ్లకు మార్కింగ్ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మిగిలిన అన్ని గ్రామాల్లోని ఇళ్లకు సంబందించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 7లోగా పూర్తిచేసి నివేదిక సమర్పించాలన్నారు. అభివృద్ధి పనులకు సంబందించిన ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని సూచించారు.
■ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం
■ గాంధీ భవన్లో ఆదిలాబాద్ నాయకులతో సమీక్షా సమావేశం
■ ఆదిలాబాద్‌కు ఏయిర్ పోర్ట్ తీసుకొస్తా: ఎంపీ
■ జోగురామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే
■ మహారాష్ట్రలో యాక్సిడెంట్.. 16 మంది జిల్లా వాసులకు గాయాలు
■ BJPలో చేరిన సాత్నాల గ్రామస్థులు
■ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, మంత్రి సీతక్క హాజరై జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్యే బొజ్జు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, విష్ణునాథ్, విశ్వనాథం పాల్గొన్నారు.
చీరతో చెట్టుకు ఊయలకు కట్టి అందులో పాపను ఉంచి తల్లి ఇంటర్ పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన ఉట్నూర్ మండలం లాల్‌టెక్డిలో చోటుచేసుకుంది. స్థానిక గురుకుల కళాశాలలోని పరీక్షకేంద్రానికి బుధవారం ఓ తల్లి బిడ్డతో వచ్చింది. చదువుకోవాలనే తపన తల్లిది.. కానీ బిడ్డను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో పాలు తాగే వయసున్న బిడ్డను చెట్టుకు చీరతో ఊయల కట్టి అందులో ఉంచింది. తోడుగా తన తల్లిని ఉంచి పరీక్ష రాసొచ్చింది.
రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణను రూపొందించనున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. జిల్లా పోలీసులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలపై విచారణ చేపట్టారు. ప్రమాద నివారణకు రంబుల్ స్టెప్స్, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటు చేయాలని, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు.
కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా కొసాగాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగానే విద్యార్థి కళాశాల, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.