India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాంసి మండలం పొన్నారికి చెందిన అశిలీ పోచన్న అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోచన్న ఆదిలాబాద్ రైతు బజారులో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. శుక్రవారం బల్బు వెలుగకపోవడంతో దాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో కౌలు రైతు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయిని, మాదకద్రవ్యాలను రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దాబాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదన్నారు. శుక్రవారం ADBలోని AR హెడ్ క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని డీఎస్పీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే సమాచారం అందించాలని సూచించారు. టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేస్తున్న ఆదిలాబాద్‌లోని రణదివ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలను డీఈవో శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయులను అభినందించారు. అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గౌడ్, సీసీ రాజేశ్వర్ తదితరులున్నారు.
యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ సాధనకు మార్గాన్ని సులువు చేయడమే లక్ష్యంగా టాస్క్ ముందుకు సాగుతుందని ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో Campus to Corporate C2C అంశంపై రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ తరగతులకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్ ను ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివాసీ విద్యార్థి సంఘం సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా వరుణ్ మరోసారి ఎన్నుకున్నారు. ఆదివాసి విద్యార్థుల సమస్యలపై పోరాడుతానని, ఆదివాసుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.