Adilabad

News July 24, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి CRIME REPORT

image

★ఆసిఫాబాద్: అడ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత 
★ కాగజ్ నగర్: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ 
★ ఆదిలాబాద్: కాంగ్రెస్ నాయకునిపై ఎస్పీకి జర్నలిస్టుల ఫిర్యాదు 
★ మంచిర్యాల : కిటికీలు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్ 
★ దహేగాం: భారీ వర్షానికి కూలిన ఇల్లు 
★ కుబీర్ : పేకాట ఆడుతున్న 6గురు అరెస్ట్ 
★ తాంసి: తోడేళ్ల దాడి.. ఐదు మేకలు మృతి 
★ భీంపూర్: పశువుల పాకలోకి దూసుకెళ్లిన RTC 

News July 24, 2024

మందమర్రి: సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు రాత పరీక్షలు

image

మందమర్రి ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా 2023-24ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన 187 మంది మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. జీఎం ఏ.మనోహర్, సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ మాట్లాడుతూ.. మహిళలు అవకాశాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సంపాదించుకుని కుటుంబాలకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు.

News July 24, 2024

ఆదిలాబాద్: కేంద్ర రహదారుల శాఖ మంత్రిని కలిసిన ఎంపీ నగేశ్

image

కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ బుదవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. NH 44 బోరజ్ నుంచి ఉపాస్నాల (మహారాష్ట్ర) గల 33 కి.మీ. రోడ్డును కేవలం 2 వరసల రోడ్డు మాత్రమే మంజూరు చేసినందున.. దీనిని కూడా 4 వరసల రహదారులుగా మార్చాలని మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ 4వరుసలుగా మార్చడానికి కొత్తగా మరో డీపీఆర్‌ను తయారు చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు.

News July 24, 2024

మంచిర్యాల: 40రోజుల పాపకు ఆధార్ కార్డు

image

పుట్టిన 40రోజులకే ఆధార్‌కార్డు పొందిన అతి పిన్న వయస్కురాలిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో ఐజాల్ ఫాతిమా స్థానం పొందింది. నస్పూర్‌కు చెందిన అఫ్జల్ పాషా-సమీరాతబస్సుమ్ దంపతులకు 2024జనవరి12న కుమార్తె ఐజాల్ ఫాతిమా జన్మించింది. ఫిబ్రవరి 21న ఆధార్‌కార్డు పొందింది. దీంతో చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. 43రోజుల పాత రికార్డును ఫాతిమా అధిగమించింది.

News July 24, 2024

ADB: కొత్తగా ఉద్యోగంలోకి చేరే వారికి రూ.15వేలు

image

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని 5 ప్యాకేజీలు ప్రవేశపెట్టారు. ఉద్యోగులతో పాటు ఉద్యోగాలు ఇచేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఉద్యోగంలో చేరిన ఫస్ట్ నెల సాలరీ 3 వాయిదాల్లో రూ.15వేల వరకు ప్రభుత్వం చెల్లించనుంది. గరిష్ఠంగా లక్షలోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో యూత్ 3.25 లక్షలు ఉన్నారు. అందులో నిరుద్యోగులు 68 వేల మంది ఉన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఉపయుక్తంగా మారనుంది.

News July 24, 2024

నిర్మల్: ఈనెల 25న ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

image

నిర్మల్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్‌లో గురువారం వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం ఉంటుందని ఎక్సైజ్ అధికారి ఎండి రజాక్ తెలిపారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు ద్విచక్ర వాహనాలు 18, మహేంద్ర బొలెరో 1, కార్లు 3, ప్యాసింజర్ ఆటోలు 3, ఒక ట్రాలీ ఆటో మొత్తం 26 వాహనాలకు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News July 23, 2024

జన్నారం: చిత్తడిగా మారిన ఆదివాసి గ్రామాల రోడ్లు

image

జన్నారం మండలంలోని ఆదివాసి, గిరిజన గ్రామాలకు వెళ్ళే రోడ్లు చిత్తడిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట అనుబంధ రాయి సెంటర్ గ్రామానికి వెళ్లాలంటే కచ్చా రోడ్డు ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఆ రోడ్డుపై కనీసం నడవలేని పరిస్థితి ఉందని రాయి సెంటర్ గ్రామస్థులు వాపోయారు. తమ గ్రామానికి రోడ్డును నిర్మించాలని వారు కోరారు.

News July 23, 2024

ఆదిలాబాద్: కుంగిన వంతెనపై రాకపోకల నిలిపివేత

image

ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి- చించుఘాట్ గ్రామాల మధ్యగల మర్రివాగుపై బ్రిడ్జ్ మంగళవారం కుంగిపోయింది. దీంతో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ సీఐ, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కుంగిన బ్రిడ్జి పై నుంచి తాత్కాలికంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. త్వరలో మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించనున్నారు.

News July 23, 2024

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 22 వరకు గడువు ఉండగా 26 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 20 నుంచి PG రెండో సంవత్సర పరీక్షలు, సెప్టెంబర్ 20 నుంచి PG మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

News July 23, 2024

ADB: బడ్జెట్ సమావేశాలపై.. ఉమ్మడి జిల్లా వాసుల ఆశ!

image

కేంద్రబడ్జెట్, రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రబడ్జెట్లో భాగంగా జిల్లాకు దక్కేవరాల ప్రకటనపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క నేటినుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తామని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.