India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతపై ITDA PO కుష్బూ గుప్తా వివరణ ఇచ్చారు. బాలికకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. ఇటీవల వైద్య శిబిరంలోనూ ఆమెకు పరీక్షలు చేయగా ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తేలలేదన్నారు. డాక్టర్ల ప్రాథమిక అభిప్రాయం ప్రకారం విద్యార్థిని శ్వాసకోస సంబంధిత సమస్యతో మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.
మావలలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే మావల ఎస్ఐ గౌతమ్ వివరాల మేరకు.. మావలకు చెందిన షేక్ పర్వేజ్ (22) పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి.. రాత్రయినా తిరిగి వెళ్లలేదు. సోమవారం ఉదయం మావల ఎర్రకుంట చెరువులో శవమై కనిపించాడు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
మహిళా హెల్ప్ లైన్ 181కు కాల్ చేసి లేదా www.shebox.nic.in వెబ్సైట్ ద్వారా లేదా లిఖిత పూర్వకంగా ఐసీసీ లేదా ఎల్సీసీకి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. యాక్ట్ 2013 పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక నివారణా పరిష్కార చట్టంపై సోమవారం కలెక్టరేట్ అవగాహన కల్పించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతీ కార్యాలయంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఏలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్‌కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే
ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.