India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని మహాసభల అనంతరం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఏ.మురళీమోహన్ రెడ్డి, అధ్యక్షుడిగా తుమ్మల లచ్చిరాం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దామెర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పి.రఘునందన్ రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా గోపాల్ ఎన్నికయ్యారు. వీరికి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
జన్నారం మండలంలోని ఇందన్పల్లి జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ టెన్త్ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ పాఠశాలలో 1998-89 సంవత్సరంలో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నాడు తమకు పాఠాలు బోధించిన గురువులను వారు శాలువాలు కప్పి సన్మానించారు అనంతరం తమ పాత జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.
మద్యం మత్తులో వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన ఆర్.నాగన్న (40) మద్యానికి బానిస అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మద్యం మత్తులో స్థానిక సుంకిడి బ్రిడ్జి పై నుంచి నీటిలో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వజాతీయ స్థాయి SGF జూడో పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడని జూడో కోచ్ రాజు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా సంఘాల బాధ్యులు అభినందనలు తెలిపారు.
ఒంటరితనంతో మద్యానికి బానిసై మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జయరాజ్ తన భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో స్వప్న పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపం చెంది ఒంటరితనం భరించలేక జయరాజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నర్సాపూర్(జి) ఆశ్రమ పాఠశాల నుంచి వినీత్, వినాయక్, నితీశ్ అనే ముగ్గురు విద్యార్థులు పారిపోయి బస్టాండ్ వద్దకు వెళ్లారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా డయల్ 100 సిబ్బంది చౌహాన్ కృష్ణ, శ్రీనివాస్ పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ హనుమాండ్లు ఆధ్వర్యంలో విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులకు అప్పగించారు.
ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన చెన్నూర్‌లో జరిగింది. CI రవీందర్ వివరాలు.. ముత్తరావుపల్లికి చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన భూమయ్య భార్య సౌందర్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో పాటు ఊరు నుంచి పారిపోయాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తతో ఉండేందుకు ఆమె నిరాకరించింది. దీంతో రాజశేఖర్ పై కక్ష పెంచుకున్న భూమయ్య శనివారం అతడి తండ్రి మల్లయ్యను గొడ్డలితో నరికి చంపాడు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రికెట్‌లో రాణిస్తూ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్న కొడిమెల హిమతేజ తొలి సెంచరీ సాధించారు. రాజస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆయన శతకం సాధించగా, క్రీడాభిమానులు అభినందనలు తెలియచేశారు. జిల్లా నుంచి ట్రోఫీకి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిమతేజ ట్రోఫీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ సెంచరీ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక షాద్నగర్ చెందిన హబీబ్ అలీ, కబీర్, రెహమాన్, మక్దూం, అల్తాఫ్, అహ్మద్, ఇమ్రాన్ శనివారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
వాట్సాప్‌లో వచ్చే గుర్తు తెలియని ఏపీకే అప్లికేషన్లను క్లిక్ చేయడం వల్ల సైబరు నేరస్తుల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని చెర్రకుంటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో అతను తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50వేలు పొగోట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైతే 1930నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.