Adilabad

News April 13, 2026

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా పతనం

image

ఇంటర్ ఫలితాల్లో ADB జిల్లా 13వ స్థానం నుంచి 33వ స్థానానికి పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధ్యాపకుల కొరత, సిలబస్ పూర్తికాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వనరుల లేమి ఫలితాలపై ప్రభావం చూపాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు పనులకు వెళ్లడం, సరైన రివిజన్ లేకపోవడం వెనుకబాటుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా అధ్యాపకులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

News April 13, 2026

ADB: రూ.20వేల సాయం.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

image

జిల్లాలో జాతీయ కుటుంబ లాభ పథకం అమలును మరింత పటిష్టం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP)లో భాగంగా అమలవుతుందన్నారు. ఈ పథకం ద్వారా, పేద కుటుంబానికి చెందిన కుటుంబ యజమాని సహజంగా లేదా ఇతర కారణాల వల్ల మరణించినట్లయితే, ఆ కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని వివరించారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 13, 2026

ఆదిలాబాద్: ముగిసిన పది పరీక్షలు

image

ఆదిలాబాద్‌లో పదో తరగతి పరీక్షల ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు నేటి వరకు కొనసాగాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పోలీసుల బందోబస్తు నడుమ పకడ్బందీగా నిర్వహించారు. ఒక్కో పరీక్షకు 4 నుంచి 6 రోజుల గ్యాప్ ఇవ్వడంతో నెలరోజులపాటుగా పరీక్షలు కొనసాగాయి. సోమవారం చివరి పరీక్షకు 10,889 మంది విద్యార్థులకు గాను 10,868 విద్యార్థులు హాజరై 21 మంది గైరాజయ్యారు.

News April 13, 2026

ఆదిలాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా..!

image

ఆదిలాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో తీవ్రంగా వెనుకబడింది. మొదటి సంవత్సరంలో 32వ ర్యాంకు (50.77%), ద్వితీయ సంవత్సరంలో 33వ ర్యాంకు (62.50%) సాధించింది. ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బాలుర ఉత్తీర్ణత తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పర్యవేక్షణ లోపం, విద్యార్థుల గైర్హాజరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

image

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. 32వ స్థానంలో ADB

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ADB జిల్లా 50.77% ఉత్తీర్ణతతో 32వ స్థానంలో నిలిచింది. మొత్తం 7,701 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,910 మంది పాస్ అయ్యారు. బాలురు 3,773 మంది పరీక్ష రాయగా 1,391 మంది 36.87% పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2519 మంది 64.13% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 935 మంది పరీక్ష రాయగా 620 మంది పాసై 66.31 శాతంతో స్టేట్‌లో 9వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

ADB: ఈసారి శాతం పెరిగేనా..?

image

గత ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది విద్యార్థులు పాస్ కాగా 54.55 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 8,890 మంది పరీక్షలు రాయగా 6,291 మంది విద్యార్థులు పాస్ కాగా 70.76 శాతంగా నమోదైంది. మొదటి సంవత్సరంలో రాష్ట్రంలో 27వ స్థానం నిలువగా, రెండవ సంవత్సరంలో 12వ స్థానంలో నిలిచింది. మరి ఈసారి ఫలితాల శాతం, స్థానం మెరుగుపడుతుందో లేదో చూడాలి మరి.

News April 12, 2026

ADB: ఈసారి శాతం పెరిగేనా..?

image

గత ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది విద్యార్థులు పాస్ కాగా 54.55 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 8,890 మంది పరీక్షలు రాయగా 6,291 మంది విద్యార్థులు పాస్ కాగా 70.76 శాతంగా నమోదైంది. మొదటి సంవత్సరంలో రాష్ట్రంలో 27వ స్థానం నిలువగా, రెండవ సంవత్సరంలో 12వ స్థానంలో నిలిచింది. మరి ఈసారి ఫలితాల శాతం, స్థానం మెరుగుపడుతుందో లేదో చూడాలి మరి.

News April 12, 2026

ADB: కాసేపట్లో తేలనున్న 17,564 మంది భవిత్వం..!

image

నేడు ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 17,564 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 7,700 మంది, ఒకేషనల్ విద్యార్థులు 935 మొత్తం 8,635 మంది ఉన్నారు. రెండవ సంవత్సరంలో జనరల్‌లో 7,971 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 958 మంది మొత్తం 8,929 మంది విద్యార్థులు ఉన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు పరీక్షలు జరిగాయి.

News April 11, 2026

ADB: కారుణ్య నియామకాల్లో 16 మందికి ఉత్తర్వులు

image

జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. 10 రెవెన్యూ , 2 సేల్స్ టాక్స్, 1 వెల్ఫేర్, 1 వైద్య శాఖ, 1 అకౌంట్స్, 1 ఇరిగేషన్ శాఖలకు కేటాయించారు.మొత్తం 15 జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పత్రాలిచ్చారు.