India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పౌర సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఫ్రాంచైజీలు కేటాయించనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

ADB జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లోని ఈవీఎం భద్రతా కేంద్రాన్ని (గోదాం) జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్ టోల్ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షల హాల్‌టికెట్లను ఈసారి సులభంగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించినట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులు 8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, ‘HAI’ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. అక్కడ కనిపించే ఆప్షన్లలో పదో తరగతి లేదా ఇంటర్ థియరీని ఎంచుకుని, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవుతుందని ఆయన వివరించారు.

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. బోథ్ ఫారెస్ట్ ఆఫీస్‌లో దాడులు నిర్వహించగా లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టుపట్టారు. ACB DSP ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కాసేపట్లో ఆయన వివరాలు వెల్లడించనున్నారు.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ADB అడవుల్లో విప్లవ శంఖం పూరించిన వీరయోధుడు రాంజీ గోండ్ వర్ధంతి నేడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో గిరిజనులను ఏకం చేసి, గెరిల్లా యుద్ధ తంత్రంతో ఆంగ్లేయ సేనలను గడగడలాడించిన ధీశాలి ఆయన. మడమ తిప్పని పోరాటం చేస్తూ చివరికి శత్రువులకు చిక్కి ఉరికొయ్యను ముద్దాడిన ఆయన త్యాగం, నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

మహిళలు, చిన్నారుల భద్రతలో విశేష ప్రతిభ కనబరిచి ఏప్రిల్ నెల రాష్ట్ర సమీక్షలో ఆదిలాబాద్ షీ టీమ్ రెండో స్థానం సాధించింది. క్లస్టర్-IVలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 65 ఫిర్యాదులు స్వీకరించి 9 FIRలు, 40 కేసులు నమోదు చేసి 52 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 39 గ్రామాల సందర్శనతో 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించిందని SP అఖిల్ మహాజన్ వెల్లడించారు.

మహిళలు, చిన్నారుల భద్రతలో విశేష ప్రతిభ కనబరిచి ఏప్రిల్ నెల రాష్ట్ర సమీక్షలో ఆదిలాబాద్ షీ టీమ్ రెండో స్థానం సాధించింది. క్లస్టర్-IVలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 65 ఫిర్యాదులు స్వీకరించి 9 FIRలు, 40 కేసులు నమోదు చేసి 52 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 39 గ్రామాల సందర్శనతో 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించిందని SP అఖిల్ మహాజన్ వెల్లడించారు.

షెడ్యూల్డు కులాల కార్యాచరణ ప్రణాళిక 2025-26లో పశు పోషణ (మిల్స్ అనిమల్స్) పథకం ఆన్‌లైన్ నమోదు కోసం ఏప్రిల్ 16 వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల యువత https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను అర్జీదారు డౌన్ లోడ్ చేసుకొని, అవసరమైన పత్రాలను జత చేసి సంబంధిత మండల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

మహారాష్ట్ర తిప్పేశ్వర్ నుంచి వచ్చిన మగపులి 6 నెలలుగా భీంపూర్, తాంసి అటవీ ప్రాంతాల్లో స్థిరపడింది. పెన్‌గంగ నది దాటి వచ్చిన పులి కదలికలను 14 కెమెరాలు, రెండు బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి (DFO) ప్రశాంత్ పాటిల్ Way2Newsకు తెలిపారు. ఇప్పటికే ఐదు పశువులను వేటాడటంతో రైతులకు పరిహారం అందించారు. మరో రెండు పులులు కూడా సంచరిస్తుండటంతో సాయంత్రం అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.