India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాంకేతికత రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నా ప్రజలను మూఢనమ్మకాలు గాఢాంధకారంలోకి నెట్టేస్తున్నాయి. పౌర్ణమి అమావాస్య రోజుల్లో కొందరు ఆకతాయిలు రోడ్లపై నిమ్మకాయలు పసుపు కుంకుమ వంటివి వేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులు ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తే ఇలాంటి భయం లేకుండా ఉంటుందని భౌతిక వాదులు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సాదాబైనామా, పీఓటీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన ప్రక్రియ జరపాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు భూ భారతి కింద వచ్చిన దరఖాస్తుల పురోగతిపై నోటీసులు జనరెట్ చేసి సర్వే చేసిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను రెండు టీములు ఏర్పాటు చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రస్తుతం పోస్టు శాఖా ద్వారా పింఛను పొందుతున్న చేయూత పింఛనుదారులు అందరూ బ్యాంక్‌లో నగదు జమ కావాలంటే బ్యాంకు ఖాతా యాక్టివేషన్ కోసం కేవైసీ చేయించుకొవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆధార్ కార్డు వివరాలు మున్సిపాలిటీలో ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. లేనిపక్షంలో తర్వాత పింఛను తీసుకోవడానికి గురయ్యే ఇబ్బందులకు తమరే భాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో పాటు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తరలింపు పకడ్బందీగా చేపడుతామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఎన్నికలను పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 120 గుర్తించినట్లు తెలిపారు. రిషేప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు 20 ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి తుది జాబితా ప్రకటన వరకు నిబంధనలు పాటించాలని సూచించారు.

పింఛన్ దారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ADB కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. దస్నాపూర్, రాంనగర్, దోబీ, షాద్, దుర్గా, కైలాష్, సుభాష్, హనుమాన్ నగర్, టైలర్స్, టీచర్స్ కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు, KRK పిట్టలవాడ నుంచి లబ్ధిదారులు మావలకు వెళ్లాల్సి వచ్చేది. వారి సమస్యను పరిష్కరించేందుకు వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవిధంగా గ్రామీణాభివృద్ధి సంస్థకు ఆదేశాలు ఇచ్చారు.

ఆదివాసీ యోధుడు కొమురం భీం వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ భీం విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవించారు. కొమురం భీం సేవలు, పోరాట స్ఫూర్తిని వారు స్మరించుకున్నారు. కొమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్, ఎస్పీ పేర్కొన్నారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా వాల్మీకీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణ, వాల్మీకి చరిత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ASP కాజల్, బీసీ శాఖ అధికారి రాజలింగు పాల్గొన్నారు.

డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన కౌన్సలింగ్ తరగతులు బోధించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. బోధన అనుభవం, PHD, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 55% మార్కులు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు www.braou.ac.inలో అక్టోబర్ 10లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.