India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా వాల్మీకీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణ, వాల్మీకి చరిత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ASP కాజల్, బీసీ శాఖ అధికారి రాజలింగు పాల్గొన్నారు.

డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన కౌన్సలింగ్ తరగతులు బోధించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. బోధన అనుభవం, PHD, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 55% మార్కులు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు www.braou.ac.inలో అక్టోబర్ 10లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లు మారితే తాము బరిలో నిలువచ్చని కొందరు, తమ అవకాశం పోతుందని కొందరు తీర్పు పైనే భారం వేశారు. అయితే
కొన్ని గ్రామాల్లో లేని కేటగిరీ వారికి రిజర్వేషన్లు వచ్చాయి. పీచర, సావర్గాం, ఆరెపల్లి, దస్తూరాబాద్(మండలం) వంటి గ్రామాల్లో అసలు బీసీలు లేరని, రిజర్వేషన్లు మార్చాలని ఆయా గ్రామాలవాసులు కోరుతున్నారు.

అమృత్ 2.0 పథకంలో భాగంగా TWRJC పాఠశాల ఆవరణలో జరుగుతున్న నీటి ట్యాంకు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పనులు వేగవంతం చేయడానికి లేబర్‌ల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సరఫరా అందించాలని స్పష్టం చేశారు.

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వినూత్న ప్రచారానికి వేదికగా మారాయి. ఇప్పటివరకు సెలబ్రిటీలు పెద్దసాయి ప్రజాప్రతినిధులకు మాత్రమే పరిమితమైన సోషల్ మీడియా ఫ్యాన్ పేజెస్ పల్లెల్లోకి సైతం విస్తరించాయి. అప్ కమింగ్ జడ్పీటీసీ ఆర్మీ అంటూ ఇన్‌స్టాలో పేజీలు ప్రారంభించారు. తమ నాయకుడు ఎక్కడికి వెళ్లినా వాటిని రిల్స్‌గా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దానికి వచ్చిన లైక్స్, షేర్స్‌ను చూసి మురిసిపోతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులు భిన్న రీతిలో తమదైన ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ నుంచి తమకే టికెట్ వస్తుందని ఆశిస్తూ ఇప్పటి నుంచే ఓటర్లను కాకా పడుతున్నారు. బయటకు మాత్రం పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిత్యం ఏదో ఒక ఊరికి వెళ్లి మద్దతును కూడగడుతూ తమకే ఎక్కువ బలం ఉందని అధిష్టానం వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణ నిర్వహించడానికి ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహించాలన్నారు. నిజాయితీతో విధులు నిర్వర్తించి ఎన్నికలను సమష్టి కృషితో పూర్తి చేయాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల వారు జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఎస్పీ అఖిల్ మహాజన్‌ను సంప్రదించారు. సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఎస్పీని నేరుగా సంప్రదించాలంటే 8712659973 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు.

కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి పంట నష్టంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి కలెక్టర్ రాజర్షిషాకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదుతో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.