India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు-2025 సజావుగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. రీటర్నింగ్ అధికారులు (ROs) స్టేజ్-II, సహాయ రీటర్నింగ్ అధికారులు (AROs) స్టేజ్-I లకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ జరిగింది. ACLB రాజేశ్వర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.

యూఐడీఏఐ (UIDAI) ఆధార్ ఎన్రోల్‌మెంట్, అప్‌డేట్ సేవల ధరలను సవరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్రోల్‌మెంట్, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) (5-17 ఏళ్లు) ఉచితంగా ఉంటాయన్నారు. జనగణన వివరాల అప్‌డేట్ (పేరు, చిరునామా)కు రూ.75, బయోమెట్రిక్ అప్‌డేట్ (వేలిముద్రలు, కనుపాప)కు రూ.125 ఆధార్ ప్రింటవుట్‌కు రూ.40 చెల్లించాలన్నారు. ఈ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బడా నేతలకు సవాలుగా మారింది. సర్పంచ్ స్థానానికి ఇద్దరేసి, జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు, నలుగురు తమకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్ఠానం వెంట పడుతున్నారు. భీంపూర్, ఉట్నూర్, బేల, భోరజ్, జైనథ్, సాత్నాల మండలాల్లో భారీగా పోటీ ఉండటంతో అన్ని పార్టీల జిల్లా నేతలకు తలపోటుగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే భయం పట్టుకుంది.

దసరా సెలవులు ముగిశాయని.. ఇంటర్ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేశ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ముఖ గుర్తింపు (Face Recognition) సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేస్తామన్నారు. ఈ హాజరును అంతర్గత, ప్రాక్టికల్ IPE 2026 థియరీ పరీక్షలలో పరిగణలోకి తీసుకుంటామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ జోరు పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రచారం వేగవంతం చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బోథ్‌లో MLA అనిల్ జాదవ్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ చేరికలపై దృష్టిసారించారు. ప్రత్యర్థి పార్టీల్లోని మెజార్టీ లీడర్లను చేర్చుకునేలా ముందుకెళ్తున్నారు.

గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రానున్న రెండో ఆర్డినరీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ప్రజావాణి రద్దు చేశామని ప్రజలు ఎవరు కలెక్టరేట్‌కు రాకుడదని సూచించారు.

ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుదని అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. బేల, భోరజ్, జైనథ్ మండల నాయకులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావహులు, వారి బలాబలాలపై సమీక్షించారు.

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. గతవారంలో 15 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ప్రతివారం జిల్లా సైబర్ క్రైమ్ బృందం వారు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడతో ముందుకువెళ్తోంది. జడ్పీ ఛైర్మన్ పదవులు కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి నలుగురు చొప్పున ఎంపిక చేయాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బేల, భీంపూర్ మండలాల్లో ఇప్పటికే పలువురి దరఖాస్తులు తీసుకున్నారు. 6వ తేదీలోపు ప్రక్రియ పూర్తిచేస్తారని సమాచారం.

దుర్గా నవరాత్రుల సందర్భంగా షీ టీమ్స్ కృషిని SP అఖిల్ మహాజన్ అభినందించారు. 119 హాట్‌స్పాట్‌ల్లో తనిఖీలు, 24 పెట్టీ కేసులు, 31 అత్యవసర కాల్స్‌కు స్పందించామని తెలిపారు. 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దస్నాపూర్‌లో వేధింపులకు పాల్పడిన 9 మంది యువకులపై మావల PSలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళలు ధైర్యంగా షీ టీంను ఆశ్రయించాలన్నారు.
Sorry, no posts matched your criteria.