Hyderabad

News July 8, 2025

HYD: బతుకమ్మ కుంట బతికింది!

image

అంబర్‌పేట‌లోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్‌లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?

News July 8, 2025

హైదరాబాద్: వైద్యశాఖలో ఉద్యోగాలు

image

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) కాంట్రాక్ట్ పద్ధతిన 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగా MBBS డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో నమోదు తప్పనిసరి. నెలవారీ వేతనం రూ.52,000 ఉంటుంది. దరఖాస్తులు 09-07-2025 నుంచి 11-07-2025 మధ్య సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి సమర్పించవచ్చు.
SHARE IT

News July 8, 2025

నకిలీ పత్రాలతో దరఖాస్తులు.. JNTU అనుమతులు!

image

కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కళాశాల నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు తీసుకుందని విజిలెన్స్ నివేదికలో తేలినా కౌన్సెలింగ్‌లో మరోసారి అనుమతి ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో అనుమతులు పొందుతున్న విద్యాసంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు సూచించినా ఇప్పటివరకు JNTU అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

News July 8, 2025

HYD: యువతి కడుపులో పావలా కాయిన్!

image

25 ఏళ్లుగా యువతి కడుపులో ఉన్న పావలా కాయిన్‌ను గాంధీ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి బయటకు తీశారు. సిటీకి చెందిన ఓ యువతి(28) తన మూడేళ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్‌ను మింగేసింది. ఇటీవల పోలీస్ ఉద్యోగానికై ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుండగా కడుపులోని కాయిన్ కారణంగా కడుపు నొప్పి కలిగింది. సదరు యువతి గాంధీలో అడ్మిట్ కాగా జనరల్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి పావలా కాయిన్ , ఓ స్టోన్‌ను బయటకు తీశారు.

News July 8, 2025

GHMC పరిధిలోకి మేడ్చల్?

image

గ్రేటర్ మరో కొత్త రూపంగా అవతరించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. GHMCలో ఇప్పటికే 24 నియోజకవర్గాలు, 150 డివిజన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మేడ్చల్ మారడంతో ఇక్కడి మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో GHMCని 3 భాగాలుగా విభజిస్తామని ప్రకటించినా నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలను విలీనం చేస్తే HYD శివారు మరింత అభివృద్ధి కానుంది.

News July 8, 2025

ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ జవాబు పత్రాల నకలుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News July 8, 2025

కాంగ్రెస్ HYD, RR జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

image

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2025

విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

image

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.

News July 8, 2025

ప్రజావాణిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సూచనలు

image

లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌‌లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి అందిన అర్జీలను కలెక్టర్ హరిచందన దాసరి సమీక్షించారు. కలెక్టర్ అధికారులను ఉద్దేశించి అన్ని సమస్యలు వేగంగా పరిష్కరించాలని, పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆమె సూచించారు.