India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6న మ.1:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మ.1:30 నుంచి మ.3 గంటల వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో సమావేశం, మ.3 నుంచి సా.4 గంటల వరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సా.4 నుంచి సా.4:55 గంటల వరకు MJ మార్కెట్‌లో గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు.
HYD శామీర్‌పేట్(M) జీనోమ్ వ్యాలీ PS పరిధిలో విషాద ఘటన ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జగన్‌గూడలోని కొల్తూరు చౌరస్తా వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి కాలు తెగి పడిపోయింది. నొప్పితో విలవిలలాడుతున్న వ్యక్తిని చూసిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.చాలా సేపు తర్వాత ‘108’ సిబ్బంది వచ్చి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ పనితీరుపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై, ఎక్విప్‌మెంట్ పని తీరుపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌లకు వెంటనే రిపేర్ చేయాలని, 8 ఏళ్లు దాటిన ఎక్విప్‌మెంట్‌లను స్క్రాప్‌కు తరలించాలని ఆదేశించారు.
పదేళ్లు దోచుకున్న ప్రజాసొమ్ము పంపకం విషయంలోనే KCR ఇంట్లో గొడవలు జరిగాయని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎవరి వెంటో ఉండటానికి మాకేం ఖర్మ?, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి CM.. ప్రజలు మాతో ఉన్నారు.. మేము ప్రజలతో ఉన్నాం.. హరీశ్, సంతోష్ అవినీతిపై కవిత ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు.. పంచుకున్నదంతా పంచుకుని ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు’ అని అన్నారు.
మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని 16, 17వ వార్డుల్లో తాగునీరు సరఫరా కావడం లేదని ఆ బస్తీ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తమ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైందని, అయితే గ్రామ పంచాయతీ హయాంలో వేసిన పైప్‌లైన్ కావడంతో వారానికి ఒకసారి చాలీచాలని బోరు నీటిని వదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
HYD యూత్ డిక్లరేషన్ అమలు కావడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. యూత్ డిక్లరేషన్ ప్రకారంగా నిరుద్యోగ భృతి రూ.4,000, ప్రతి ఏడాది జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 నాటికి రిక్రూట్‌మెంట్ పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, సెప్టెంబర్ 17 దగ్గరికి వస్తున్నప్పటికీ జాబ్ క్యాలెండర్ రాలేదన్నారు. ఎప్పుడు అమలు చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
HYD అమీన్‌పూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి(31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్(7), సాత్విక్(6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
HYD నలు దిక్కుల అభివృద్ధి కోసం 30 వేల ఎకరాల భూమి అవసరమని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలియజేశారు. 350 కిలోమీటర్ల RRR పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మాస్టర్‌ప్లాన్ 2050 సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. HYD విస్తరణలో భాగంగా మొదటి దశలో 1000 ఎకరాలు అవసరమని దీనికి సంబంధించి భూసేకరణపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు.
HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో 2021లో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అభిరామ్ దాస్‌కు కోర్టు జీవిత ఖైదు, రూ.60 వేలు జరిమానా విధించిందని పోలీసులు ఈరోజు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. కాగా 363, 366, 376(AB), 376(2)(m), 377 ఐపీసీ& పోక్సో Act కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీ పని చేసే అభిరామ్ ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు.
డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు HYDలో పోస్ట్ కార్డ్స్ రాశారు. టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలతోపాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎంను కోరారు.
Sorry, no posts matched your criteria.