India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చెరువుల బదిలీలో భారీ స్కామ్ జరిగిందా? GO 120 (2010) ప్రకారం 501 చెరువులను గుర్తించి, అందులో 399 మున్సిపల్ శాఖకు అప్పగించారు. కానీ పదేళ్లలోనే ఈ సంఖ్య 185కి ఎలా పడిపోయింది? హిమాయత్‌సాగర్ పరిధిలో 40 శాతం నీటి విస్తీర్ణం మాయమై, కాంక్రీట్ కోటలు వెలిశాయి. హుడా మాస్టర్ ప్లాన్ లెక్కలకూ, ఇప్పటి పరిస్థితికీ పొంతన లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న <<19672164>>చెరువులు క్షేత్రస్థాయిలో<<>> కనిపించడం లేదు.

నగర చెరువుల మరణశాసనం 1990ల్లోనే మొదలైంది. 10 హెక్టార్ల లోపు ఉన్న కుంటలను నివాస ప్రాంతాలుగా మార్చుకోవచ్చన్న ప్రభుత్వ నిర్ణయంతో 3,000కు పైగా నీటి వనరులు కనుమరుగయ్యాయి. 60 వేల చెరువుల లెక్కలున్నా నిజాం కాలం నాటి ఉర్దూ రికార్డులను కావాలనే తొక్కిపెట్టారా? రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనం కోసమే ఈ అదృశ్య పర్వం సాగిందా? అన్నట్లు తయారైంది. నేడు మిగిలిన కొద్దిపాటి జలవనరుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

జాబ్ గ్యారంటీ అంటూ ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి నిరుద్యోగుల జేబులకు భారీ కన్నం వేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి కేంద్రంగా సాగిన ఈ ‘మాల్టా’ దందాలో 100మంది అమాయకులు రూ.5కోట్లు పోగొట్టుకున్నారు. MSME ముసుగులో నమ్మించి, ఫేక్ డొమైన్లతో నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారు. వీరి గుట్టును CID రట్టు చేయగా ఏడుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

HYD అమీర్‌పేట్ కేంద్రంగా నడిచిన ఓ ప్రముఖ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మోసం బయటపడింది. ‘గ్యారెంటీడ్ ప్లేస్‌మెంట్’ పేరిట 500మంది నిరుద్యోగుల నుంచి తలో రూ.2లక్షల వరకు వసూలు చేసింది. మొత్తం రూ.10కోట్లకుపైగా కాజేసినట్లు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సిస్ వింగ్ గుర్తించింది. బాధితులకు నకిలీ ప్రాజెక్ట్‌లను ఇచ్చి, వారు ట్రైనింగ్‌లో విఫలమయ్యారనే సాకుతో డబ్బులు ఎగ్గొట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న మోసంపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారిక లోగోలను వాడుతూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50వేల- రూ.లక్ష వరకు వసూలు చేశారు. 6 నెలల్లోనే ఈ తరహా మోసాలపై సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో 120కిపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులే ఉండటం గమనార్హం.

BJP MP తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని DGP శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును భారత్- పాకిస్థాన్ విభజనతో ఎంపీ పోల్చడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విభేదాలను పెంచే అవకాశం ఉందని, చట్టపరమైన నిబంధనల ప్రకారం తేజస్వీ సూర్యపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Sorry, no posts matched your criteria.