Hyderabad

News April 18, 2026

HYD: ఫ్యూచర్ సిటీలో మెరిసిపోనున్న వెలుగులు!

image

ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. UGD పనులతో సందడిగా ఉన్న మీర్‌ఖాన్‌పేటలో ఇప్పుడు వెలుగుల పండుగ మొదలైంది. నెట్ ‘0’ లక్ష్యంగా సుమారు రూ.1.49 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా 120 అత్యాధునిక LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా కార్బన్ తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి బాటలో ఈ పల్లె ఇప్పుడు నగర హంగులను సంతరించుకుంటోంది.

News April 17, 2026

HYD‌లో నయా ట్రెండ్ ఇదే!

image

HYDలో నైట్‌లైఫ్ ఇప్పుడు పక్కా క్యాలెండర్ ఈవెంట్‌లా మారిపోయింది. ఐటీ కుర్రాళ్లు, స్టూడెంట్స్ వారం ముందే గెస్ట్ లిస్టులు, టేబుల్స్ బుక్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో క్లబ్బింగ్ అంటే ఒక మినీ ఫెస్టివల్‌ను తలపిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో, రాత్రిపూట తిరగడం కంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకోవడానికే యువత ప్రాధాన్యం ఇస్తోంది. పక్కా షెడ్యూల్‌తో ఎంజాయ్ చేయడం ఇప్పుడు ట్రెండ్.

News April 17, 2026

HYD: చెరువుల లెక్క తేలదు.. కబ్జాల పర్వం ఆగదు! (5)

image

HYD మెట్రోపాలిటన్ పరిధిలో 3,132 చెరువులు ఉన్నాయని లెక్కలు చెబుతున్నా అవన్నీ అరకొరవే. మరో 146 చెరువుల ఊసే లేదు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేక సర్వేలు సాగుతూనే ఉన్నాయి. తీరా నోటిఫికేషన్ ఇచ్చేసరికి అసలు రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం కంటే 120.895 ఎకరాల <<19675011>>FTL<<>> తగ్గిపోయింది. ఈ మాయ వెనుక ఉన్నది ఎవరు? ప్రభుత్వ ప్రయత్నాలు ఉత్త ముచ్చటగానే మిగిలాయి. ఇక వీటిని రక్షించే నాథుడే లేడా?.. మీ కామెంట్?

సరూర్‌నగర్‌లో 14 చెరువుల సమాధి.. రేపటి గతేంటి? (4)

image

నగరంలో జలవనరుల విధ్వంసం భయంకరంగా ఉంది. సరూర్‌నగర్ మం.లోనే 14 చెరువులు పూర్తిగా అదృశ్యమయ్యాయి. మీరాలం ట్యాంక్ పరిధిలో 9 చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. మరో 20 చెరువులు వెంచర్ల మధ్య ఊపిరి కోల్పోతున్నాయి. నిజాం రికార్డులను బయటకు తీస్తే కబ్జాదారుల అసలు రంగు బయటపడుతుంది. ఇలాగే వదిలేస్తే చెరువులు కనిపించవిక. <<19672915>>వారసత్వ సంపదను<<>> ప్లాట్లుగా మార్చే హక్కు ఎవరిచ్చారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

News April 17, 2026

HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

image

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2026

HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

image

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు <<19672685>>’పరిశీలిస్తాం’<<>> అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!

News April 17, 2026

బాంబు కాదు: ఉప్పల్ మెట్రో స్టేషన్ చెత్త డబ్బాలో టపాసులు: పోలీసులు

image

ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు బెదిరింపు వార్తలపై పోలీసులు స్పందించారు. చెత్త డబ్బాలో టపాసులు ఉన్నట్లు గమనించిన సిబ్బంది మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై PSకు కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్‌ను తనిఖీ చేయగా, అవి వేడుకల్లో వాడే టపాకాయలని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

News April 17, 2026

గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే రూ.25వేల రివార్డు: మంత్రి

image

నాగోల్ డ్రైవింగ్ సెంటర్‌లో ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే రూ.25వేల నగదుతో ‘రహవీర్ అవార్డు’ ఇస్తామని ప్రకటించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.