India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD సంస్థానంలో 1813లో కలరా మహమ్మారి విజృంభించిన సమయంలో అప్పయ్య చేసిన పవిత్ర మొక్కు నుంచి నేటి లష్కర్ బోనాల వైభవం వరకు ఉజ్జయిని మహంకాళి దేవాలయం అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. 1815లో కొయ్య విగ్రహంతో ప్రారంభమైన ఈ చారిత్రక క్షేత్రం, నగర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారి దయుంటే అన్నీ జరిగుతాయని భక్తుల విశ్వాసం.

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీతో ముగియనుంది. రూ.100 లేట్ ఫీజుతో 21వ తేదీ వరకు, రూ.300 ఫైన్‌తో 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in

రెండు నెలలుగా భారీగా పడిపోయిన టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. 2 వారాల క్రితం రూ.10కే 2 కిలోలు అమ్మారు. గతవారం రూ.10కి కిలో విక్రయించారు. నిన్న రాత్రి నగర శివారులో వారాంతపు మార్కెట్లో కేజీ రూ.20- 25 వరకు అమ్మారు. ఉప్పల్ పెద్ద మార్కెట్లోనూ దాదాపు ఇదే రేట్‌కు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దుకాణాల్లో రూ.30 వరకు కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. మీ ఏరియాలోనూ టమాటా రేట్లు పెరిగాయా? కామెంట్ చేయండి.

KPHB మెట్రో పిల్లర్ నం. A-834 వద్ద శుక్రవారం <<19678807>>రాత్రి<<>> ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(శ్రీ దుర్గా మల్లేశ్వరి ట్రావెల్స్)లో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లుకు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. UGD పనులతో సందడిగా ఉన్న మీర్‌ఖాన్‌పేటలో ఇప్పుడు వెలుగుల పండుగ మొదలైంది. నెట్ ‘0’ లక్ష్యంగా సుమారు రూ.1.49 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా 120 అత్యాధునిక LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా కార్బన్ తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి బాటలో ఈ పల్లె ఇప్పుడు నగర హంగులను సంతరించుకుంటోంది.

Sorry, no posts matched your criteria.