India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

BJP MP తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని DGP శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును భారత్- పాకిస్థాన్ విభజనతో ఎంపీ పోల్చడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విభేదాలను పెంచే అవకాశం ఉందని, చట్టపరమైన నిబంధనల ప్రకారం తేజస్వీ సూర్యపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

మైక్రో ఫైనాన్స్ మోసాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మధుపై సైబరాబాద్ పరిధిలోని పలు PSలలో మోసపూరిత కేసులు నమోదు కాగా, తాజా అరెస్టుతో దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మధును పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో మంగ్లీ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

చిలుకూరులోని SBI- RSETI నిరుద్యోగ యువతకు ‘హౌస్ వైరింగ్’లో ఉచిత శిక్షణ ఇస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన 18- 50 ఏళ్లలోపు వారు ఈ కోర్సుకు అర్హులు. ఉచిత భోజనం, వసతి, ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తారు. ఆధార్, రేషన్‌కార్డ్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

TG DEECET- 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. MAR 15 నుంచి APR 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు. SHARE IT.

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.

ఏప్రిల్ 20న జరిగే భారీ బహిరంగ సభలు TGలో పొలిటికల్ హీట్‌ను పెంచనున్నాయి. BRS జగిత్యాల జైత్రయాత్ర సభలో KCR ప్రసంగించనున్నారు. అదే రోజు CM రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, సభలో మాట్లాడనున్నారు. అవుట్‌డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం BRS సభ పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటుండగా, ఇన్ని రోజులు పట్టించుకోని రేవంత్ రెడ్డి KCRకు భయపడి ఇప్పుడు మేడిగడ్డను చూసేందుకు వస్తున్నారని BRS నేతలు అంటున్నారు.

నగరంలో యథేచ్ఛగా బోర్లు వేస్తున్నారు. వేసవిలోనూ వందల ఫీట్లు తవ్వుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఈ లారీపై పనిచేసే UP, బిహార్, ఒడిశా కార్మికులకు రక్షణ కరవవుతోంది. వీధుల్లో కరెంటు వైర్లు చేతులతో పట్టుకుంటున్నారు. ఇంటి, బండి యజమానులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే తుర్కయంజల్‌లో కొత్తిల్లు నిర్మిస్తుండగా కరెంటు తీగ తగిలి ఓ కార్మికడు మృతి చెందాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

కుటుంబ విలువలను మంటగలిపే అమానుష ఘటన మేడిపల్లి PS పరిధిలో వెలుగుచూసింది. మామకు తోటికోడలి కుమారుడిపై ఆదరణ ఎక్కువన్న అసూయతో మహిళ బాలుడికి యాసిడ్ తాగించింది. బోడుప్పల్‌కు చెందిన నాగరాజు, సంధ్యలకు కార్తీక్ వాసు(4) కుమారుడున్నాడు. ఈ నెల 9న నాగరాజు సోదరుడి భార్య మంజుల, జ్యూస్ అని కార్తీక్‌కు యాసిడ్ తాగించింది. ఇంతకు ముందూ అతడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.