Hyderabad

News July 30, 2024

BREAKING: HYD: వనస్థలిపురంలో గ్యాంగ్ రేప్

image

HYD వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే హోటల్‌లో యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. స్నేహితుడితో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 30, 2024

దేశంలోనే 4వ స్థానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

image

శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యా పరంగా దేశంలోనే 4వ స్థానంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ త్వరలోనే ఆస్థానాన్ని మరింత మెరుగుపరచుకోనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే 10.9% పెరుగుదలతో శరవేగంగా బిజీగా మారుతున్న ఎయిర్ పోర్టులలో నగరం ఒకటిగా నిలుస్తోంది.

News July 30, 2024

HYDలో ధార్ గ్యాంగ్ కదలికలు.. జాగ్రత్త!

image

ధార్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఘట్‌కేసర్ క్రైమ్ ఎస్ఐ అశోక్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ధార్ గ్యాంగ్ కదలికలు కనిపించాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులపై అనుమానం వస్తే ఫోన్ చేయాలని కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ పలు చోట్ల చోరీలకు పాల్పడిన విషయం విదితమే.

News July 30, 2024

వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై సీఎం సమీక్ష

image

అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్-పరిగి-కృష్ణా రైల్వే లైన్ పనులపై రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

News July 29, 2024

లోక్ సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న BJPకి లోక్ సభలో విప్‌గా బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ సభ స్పీకర్‌కు పార్టీ తరుఫున చీఫ్ విప్, విప్‌లుగా నియమించిన వారి పేర్లను తెలియజేశారు. రాష్ట్రం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 29, 2024

HYD: వివాహిత అనుమానస్పద మృతి

image

మెడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని వెంకట్ రెడ్డి నగర్‌లో 4 అంతస్థుల భవనం నుంచి దూకి దివ్య(29) అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అంబర్పేట్ ప్రేమ్ నగర్‌కు చెందిన దివ్యకు రామంతపూర్ రామ్ రెడ్డి నగర్‌కు చెందిన నవీన్‌తో ఏప్రిల్ 24, 2024న పెళ్లైంది. ఈనెల 27న దివ్య మిస్ ఐనట్లు పుట్టింటి వారికి చెప్పారు. నేడు ఆత్మహత్య చేసుకోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు.

News July 29, 2024

ముఖేష్ గౌడ్ వర్ధంతి వేడుకలకు హాజరైన కేటీఆర్

image

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతిని సోమవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLAలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్‌లు పాల్గొని ముఖేష్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.

News July 29, 2024

HYD: రోడ్లపై వెళ్లేవారిని అడ్రస్ అడిగి.. చైన్‌స్నాచింగ్

image

గ్రేటర్ HYDలో చైన్ స్నాచర్లు విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లేవారికి ఓ చీటీ చూపి అడ్రస్ అడుగుతున్నారు. వారు చెప్పేలోపే గోల్డ్ చైన్ కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్ వాసి అశ్విని గొలుసును దుండగులు ఇలాగే కొట్టేశారు. జర జాగ్రత్త!
SHARE IT

News July 29, 2024

HYD: మమ్మల్ని వీడియోలో చూపించండి: హరీశ్‌రావు

image

ప్రస్తుతం అసెంబ్లీ కొనసాగుతోంది. కాగా సభ ప్రారంభించే ముందు MLA హరీశ్‌రావు మాట్లాడుతూ.. BRS ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు వీడియోలో చూపించడం లేదని ప్రజలే చెబుతున్నారని అనడంతో కుత్బుల్లాపూర్ MLA వివేకానంద అవునని అన్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. అలా అనడం పొరపాటని, అందరినీ పర్‌ఫెక్ట్‌గా చూపిస్తున్నామని సమాధానం ఇచ్చారు.

News July 29, 2024

HYD: హాస్పిటళ్లకు పెరిగిన డయాలసిస్ పేషెంట్ల తాకిడి..!..!

image

HYD నగరంలో NIMS, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పేద రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మూడు ఆసుపత్రుల్లో 400-600 మంది వరకు నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ పేషంట్ల మరణాల రేటు HYDలో ఇది 8 శాతం వరకు ఉంటే జిల్లాల్లో 15 శాతం వరకు నమోదవుతోందని వైద్యులు తెలిపారు. అయితే జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు లేకపోవడంతో HYD నగరంలోని ప్రధానమైన 3 ప్రభుత్వ ఆసుపత్రులకు తాకిడి పెరిగింది.