Hyderabad

News June 23, 2024

HYDలో మరో MURDER..?

image

గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన HYD చందానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చందానగర్ హుడాకాలనీ సాయిబాబా ఆలయం ఆనుకొని ఉన్న నిర్జన ప్రదేశంలో మహిళ(40) మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లుగా అనుమానించారు. మృతురాలి ఎడమ చేతిపై బాలయ్య అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. కేసు నమోదు చేశారు.

News June 23, 2024

HYD: మాజీ ప్రియుడిపై కేసు నమోదు

image

మాజీ ప్రియుడి వేధింపులకు తట్టుకోలేని ఓ గృహిణి HYD మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీర్‌పేట్ పరిధి రహమత్‌నగర్‌లో నివాసముంటున్న గృహిణిని ఆమె మాజీ ప్రియుడు ఆర్బాజ్ ఖాన్ కలవాలని, లేకపోతే గతంలో ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన బాధితురాలు PSను ఆశ్రయించగా కేసు నమోదైంది.

News June 23, 2024

HYD: నంబర్ ప్లేట్ మార్చితే చీటింగ్ కేసులు నమోదు

image

చలానాల నుంచి తప్పించుకునేందుకు పలువురు వాహనాల నంబర్ ప్లేట్ తారుమారు చేయటం, కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ HYDలో నంబరు ప్లేటు లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న 85 వాహనాల్లో 35 మంది యజమానులపై కేసు నమోదు చేశారు. 40 మంది మైనర్లను పట్టుకున్నారు.180/177 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.

News June 23, 2024

BREAKING: మియాపూర్, చందానగర్‌లో 144 సెక్షన్ 

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్, చందానగర్ PSల పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తాజాగా లేఖను విడుదల చేశారు. రోడ్లపై ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మియాపూర్‌లోని సర్వే నంబర్ 100,101 వద్ద 3 రోజులుగా నెలకొన్న ఆందోళనల్లో భాగంగా ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 

News June 23, 2024

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న ఏ.వెంకటయ్యను కీసర ఎస్‌హెచ్ఓగా, కీసర SHOగా విధులు నిర్వహిస్తున్న కే.సీతారామ్‌ను కందుకూరు ఠాణాకు, కందుకూరు SHOగా పనిచేస్తున్న మక్బూల్ జానీని సైబర్ క్రైం విభాగానికి, యాదాద్రి ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కే.నాగరాజును మీర్‌పేట్ PSకు బదిలీ చేస్తునట్లు తెలిపారు.

News June 23, 2024

HYD: ఆ ఫిర్యాదులూ స్వీకరించాలి: సైబరాబాద్ CP  

image

ఉద్యోగాల పేరుతో మోసాలు, ఇతర వంచనాలకు పాల్పడే నిందితులపై బాధితులు వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదులనూ స్వీకరించి కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. బాధితులు వ్యక్తిగతంగా వెళ్లి ఫిర్యాదు చేస్తే SHO నిరాకరిస్తున్నారని, పలువురు జర్నలిస్టులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. బైక్ రేసులపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

News June 23, 2024

HYD: పాతబస్తీలో మోహరించిన పోలీసులు

image

హైదరాబాద్‌లో కొద్ది రోజుల నుంచి వరుస హత్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఏరియాల్లో హైదరాబాద్ పోలీసులు మోహరించారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి హైదరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీలో పటిష్ఠ బందోబస్తు చేపట్టాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు. రాజధానిలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News June 23, 2024

HYD: ఆషాఢం బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు మంజూరు

image

ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ HYDలో వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవాదాయ శాఖ కమిషనర్లతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.

News June 23, 2024

ఓయూలో వన్ టైం ఛాన్స్.. మిస్ అవ్వకండి..!

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

News June 23, 2024

HYD: శంషాబాద్‌లో దారుణం   

image

శంషాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. RGIA పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్‌కు చెందిన దంపతులు కూలీలు. వారికి కూతురు ఉంది. ఈక్రమంలో అనారోగ్యంతో భర్త 2నెలల క్రితం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య ఇటీవల పనుల కోసం బయటకు వెళ్లగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. అదే రోజు వరుసకు చిన్నాన్న అయ్యే యాకేశ్ ఇంట్లోకి వెళ్లి బాలిక(14)ను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.