Hyderabad

News July 25, 2024

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో బదిలీలు.. సామాన్యుల ఇక్కట్లు

image

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో పలువురు వైద్యులు బదిలీ కావడంతో కంటి చూపు పరీక్షల కోసం వచ్చిన సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు ప్రొ.డాక్టర్లు, నలుగురు అసోసియేట్ డాక్టర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లు, ఫార్మాసిట్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, సిస్టర్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, స్వేకుంట్, గ్లకోమా అండ్ కార్నియాను సంబంధించిన సిబ్బంది బదిలీపై వెళ్లారు.

News July 25, 2024

HYD: అత్యాచారం.. మెలిపెట్టే నొప్పితో చిన్నారి గోస..!

image

మలక్‌పేట్‌లో <<13702575>>బాలిక(8)పై అత్యాచారం<<>> జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. ఓ వైపు మెలిపెట్టే నొప్పి, మరోవైపు 15 రోజులుగా ఒకరి తర్వాత మరొకరు వేస్తోన్న ప్రశ్నలతో ఆ చిట్టితల్లి ఆందోళనకు గురైంది. మానసిన నిపుణులు వేసిన ప్రశ్నలకు బాలిక సరైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News July 25, 2024

HYD: మూడో తరగతి చదువుతున్న అంధ బాలికపై అత్యాచారం!

image

HYDలో దారుణ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన అంధ బాలిక(8) మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఇటీవల చిన్నారికి రక్తస్రావం కావడంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి ఆమెను వైద్యులకు చూపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వారు నిర్ధారించారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే యువకుడి(23)పై అనుమానంతో PSలో ఫిర్యాదు చేశారు.

News July 25, 2024

HYD: 9999 నెంబర్ ప్లేట్‌కు అక్షరాల రూ.19.51 లక్షలు

image

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో ‘TG09A9999’ నంబర్ ఏకంగా రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ సంస్థ అంత మొత్తం చెల్లించి నంబరును సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ‘TG09 B’ సిరీస్‌లో ‘0001′ నంబరును రూ.8.25 లక్షలు చెల్లించి ఎన్‌జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ దక్కించుకుందని జేటీసీ రమేశ్ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.51,17,514 ఆదాయం సమకూరిందని వివరించారు.

News July 25, 2024

HYD: రెండు కొత్త మార్గాల్లో ఐటీ కారిడార్‌కు బస్సులు

image

ఐటీ కారిడార్‌లో ప్రయాణ కష్టాలు తీర్చేలా రెండు కొత్త మార్గాల్లో బస్సులు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు గ్రేటర్ RTC ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సర్వీస్‌తో ఘట్కేసర్ నుంచి కొండాపూర్(282 కే) మార్గంలో రెండు మెట్రో ఎక్స్ ప్రెస్‌లు నడుపుతున్నట్లు తెలిపారు. రాంపల్లి, నారాయణగూడ, నాగారం, రాంపల్లి క్రాస్ రోడ్, మాసపు ట్యాంక్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తదితర మీదుగా కొండాపూర్ చేరుకోవచ్చన్నారు.

News July 25, 2024

హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్ హత్య

image

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికుల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్‌లో యువకుడిని హత్య చేశారు. మంగళవారం రాత్రి మహమ్మద్ ఖాజా పాషా(ర్యాపిడో డ్రైవర్), అతడి స్నేహితుడు పర్శకు గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో పాషాపై కర్రతోదాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 25, 2024

HYD: వీధి కుక్కల సమస్యా.. ఫోన్ చేయండి

image

వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News July 25, 2024

తండ్రి కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్న KTR

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కలిసి.. తండ్రి కేసీఆర్, తల్లి శోభమ్మలకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.ఈ సందర్భంగా కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్.. మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.

News July 24, 2024

HYD: చిన్నారిపై కుక్కల దాడి

image

హైదరాబాద్‌లో కుక్కల దాడి రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో సైతం ఈరోజు ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో జరగగా.. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

News July 24, 2024

HYD: మొయినాబాద్‌ PS పరిధిలో 144 సెక్షన్ అమలు

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకూరు గ్రామంలో మంగళవారం జరిగిన మసీదు నిర్మాణ పనులను నిలిపివేయాలని RSS, బజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ నాయకులు ‘చలో చిలుకూరు’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో మొయినాబాద్ PS పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.