Hyderabad

News June 21, 2024

యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ యోగా దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ బిజెపి నేతలు పాల్గొన్నారు. విద్యార్థులు యోగా శరీరం మనుసును కలుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, యోగానే ఒక్క డాక్టర్ అని అన్నారు.

News June 21, 2024

BREAKING.. HYD: కరెంట్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి

image

కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మృతి చెందిన ఘటన హయత్ నగర్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగింది. కాగా, మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

HYD: నగరంలో విద్యార్థులకు ఈ తిప్పలు తీరేదెన్నడు?

image

HYD నగరంలోని హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, గండిపేట, ఎల్బీనగర్, అత్తాపూర్, శంషాబాద్, మరోవైపు చేవెళ్ల, తాండూరు లాంటి అనేక ప్రాంతాల్లో విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ చేయాల్సిన పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. సరైన సమయానికి కాలేజీ, పాఠశాలకు చేరుకోవాలని, ప్రమాదకరమైనప్పటికీ ప్రయాణించక తప్పట్లేదని విద్యార్థులన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నా పరిష్కారం చూపటం లేదని వాపోయారు.

News June 21, 2024

HYD: బావ ప్రేమించడం లేదని.. నర్స్ ఆత్మహత్య!

image

మేనబావ ప్రేమించడం లేదని జీవితంపై విరక్తి చెందిన నర్స్ మోతాదుకు మించి అనస్థీషియా తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. CI లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల ప్రకారం.. రమా(23) కొండాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోదరి వద్దకు వచ్చి.. అనస్థీషియా తీసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News June 21, 2024

HYD: 49 జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత

image

ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన బోధన సాధ్యమవుతుంది. HYD, RR, మేడ్చల్ జిల్లాలోని 49 జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. నియామకాలు చేపట్టకపోవడంతో ఏటా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. నిధుల కొరతతో ఈ విద్యా సంవత్సరంలో నియమించలేదు. ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి ఉంటే కొంతైనా పరిష్కారం లభించేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

News June 21, 2024

HYD: బుర్కాతో వచ్చి.. కత్తితో పొడిచి దోపిడీకి యత్నం

image

ఓ బంగారు ఆభరణాల యజమానిని కత్తితో పొడిచి దోపిడీకి యత్నించిన విషయ తెలిసిందే. DCP కోటిరెడ్డి, CI సత్యనారయణ ప్రకారం.. మేడ్చల్‌లోని శ్రీ జగదాంబ జువెలర్స్‌లోకి బురఖా వేసుకొని ఒకరు, హెల్మెట్‌తో మరొకరు వచ్చారు. యజమాని ఛాతిలో కత్తితో పొడవగా.. పక్కనే ఉన్న అతడి కొడుకు ఇంట్లోకి పారిపోయాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగులో వేయాలని బెదిరించగా వారిని నెట్టేసి బయటకు పరిగెత్తి చోర్ అని అరవడంతో దుండగులు పారిపోయారు.

News June 20, 2024

హైదరాబాద్‌ నుంచి ZOO PARK తరలింపు.. క్లారిటీ!

image

HYD బహదూర్‌పురా నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్‌ తరలింపు‌‌ అవాస్తవం అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయమై PCCF వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్(తెలంగాణ మెంబర్) క్లారిటీ ఇచ్చారు. షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని‌ పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా లేదని వివరణ ఇచ్చారు. కాగా,‌ జూ పార్కుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు.
SHARE IT

News June 20, 2024

HYD‌లో కిషన్ రెడ్డికి గ్రాండ్‌ వెల్‌కమ్

image

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి‌‌కి ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు‌ ఎయిర్‌పోర్టు‌కు వచ్చిన బండి సంజయ్‌‌‌కి పండితులు ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణలోని నలుమూలల నుంచి వచ్చిన కీలక నేతలు‌ కేంద్రమంత్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సెల్యూట్‌ యాత్ర ప్రారంభించారు.

News June 20, 2024

HYD బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో‌ భోనాలు జరగనున్నాయి.

News June 20, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్‌లోనే..!

image

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యల్పంగా సి-సెక్షన్స్ సిజేరియన్లు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 51 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెల రిపోర్ట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వికారాబాద్ జిల్లాలో ఏకంగా 86% కడుపు కోతలు జరిగాయని తెలిపారు.