India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో వందల ఏళ్ల నుంచి బోనాల పండుగ సంప్రదాయం జరుపుతున్నామన్నారు. ఎక్కడా లేని బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ<<13674167>> ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
అధికార యంత్రాంగమంతా వరద నివారణ చర్యల్లో ఉందని, 24 గంటలు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు కూలడం తదితర ఇబ్బందులపై ఆమె అధికారులతో మాట్లాడారు. జోనల్ సర్కిల్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తరచుగా నీరు నిలిచే ప్రాంతాల్లో 238 స్టాటిక్ బృందాలు రోజంతా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకుంటున్నారు. తల్లి దర్శనం కోసం సాధారణ భక్తులు క్యూ కట్టారు. మోండా మార్కెట్ నుంచి మహంకాళి టెంపుల్ వరకు అంతా సందడిగా మారింది. ఇటువంటి పర్వదినం రోజున 1850 నాటి అమ్మవారి అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.
ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. పద్మారావునగర్ స్కందగిరిలో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఏర్పాట్లను పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.