Hyderabad

News July 16, 2024

HYD: కారులో తిప్పుతూ అత్యాచారం.. ఇద్దరి ARREST

image

అల్వాల్ <<13638517>>రేప్ కేసును<<>> పోలీసులు ఛేదించారు. మేడ్చల్ DCP కోటిరెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలహాల నేపథ్యంలో శుక్రవారం అల్వాల్ PSలో ఫిర్యాదు చేసి వెళ్తుండగా కారులో తిప్పుతూ ముగ్గురు అత్యచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

News July 16, 2024

HYD: పెన్షన్ కోసం మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు

image

బతికున్నా, చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన చెందారు. HYD ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59)కు భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే.. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అన్నారని వాపోయారు. తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.

News July 16, 2024

HYD: ఆసుపత్రులకు పోటెత్తారు.. జర జాగ్రత్త..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ, డిఫ్తీరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిలోఫర్‌లో 2 రోజుల్లో ఏడుగురు, గాంధీలో నలుగురు చిన్నారులు డెంగ్యూతో చేరారు. నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల రద్దీ ఎక్కువైంది. కాచి చల్లారిన నీటిని తాగాలని, వేడి ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు. 

News July 16, 2024

HYD: పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు..!

image

గ్రేటర్ HYD పరిధిలో జూన్‌లో 7,014 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 14 శాతం రూ.కోటి పైన విలువున్న ఆస్తులే కావడం విశేషం. రిజిస్ట్రేషన్లలో గతేడాది జూన్‌తో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. గత నెలతో పోలిస్తే 16 శాతం పెరుగుదల నమోదైంది. జనవరి నుంచి జూన్ వరకు 39,220 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే మొదటి 6 నెలల్లో 15% పెరిగాయి.

News July 16, 2024

HYD: ఆ ఘనత సాధించిన తెలంగాణ తొలి మహిళ హారిక 

image

బైక్​పై ఎవరెస్ట్​ శిఖరం కంటే ఎత్తయిన రోడ్డు మార్గంలో ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకుని తిరిగొచ్చిన HYD​ మహిళా రైడర్​ హారికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే వివేక్‌ను హారిక కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగుల ఎత్తు)ను చేరుకున్న తెలంగాణ తొలి మహిళగా హారిక నిలిచి, ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం అభినందనీయమన్నారు.

News July 16, 2024

ప్రజావాణి వినతులు వేగంగా పరిష్కారం: GHMC

image

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు సోమవారం GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 అర్జీలు, ఫోన్ ద్వారా మరో 8 విన్నపాలు వచ్చాయని పరిపాలన విభాగం అదనపు కమిషనర్ నళిని పద్మావతి తెలిపారు. ఆరు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 102 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించారని, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

News July 16, 2024

HYD: కారులో తిప్పుతూ అత్యాచారం.. డ్రైవర్ ARREST

image

మహిళపై <<13630752>>అత్యాచారానికి<<>> పాల్పడిన ఘటనలో అల్వాల్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆటోలో వెళ్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను ముగ్గురు కారులో తిప్పుతూ చిత్రహింస పెట్టారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అల్వాల్ పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News July 16, 2024

HYD: టాస్కుల పేరుతో రూ.11.21 లక్షలు స్వాహా 

image

ఓ యువతి వద్ద రూ.11.21 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ యువతికి ‘కాయిన్ సీఎక్స్’ కంపెనీ పేరుతో ఓ మెసేజ్  వచ్చింది. దాంట్లో వీడియోలకు లైక్‌లు కొట్టి పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఉంది. మొదటగా 3 టాస్కులు చేసి పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.11.21 లక్షలు పెట్టుబడి పెట్టింది. విత్ డ్రా కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

News July 16, 2024

HYD:‘విడాకులు ఇచ్చినా.. ఆయనే కావాలి’

image

కోర్టు విడాకులు మంజూరు చేశాక.. తిరిగి ఆయనే భర్తగా కావాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించిన ఘటన శంషాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాల్‌దర్వాజకు చెందన సిద్ధార్థ్, కవితల పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి. వారిద్దరు కోర్టును ఆశ్రయించగా విడాకులు మంజూరు చేసింది. దీని తర్వాత సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మళ్లీ ఆయనే కావాలని ఇటీవల పోలీసులను ఆశ్రయించారు ఆ మహిళ.

News July 15, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి> కన్నుల పండువగా జగన్నాథుడి రథయాత్ర> బోడుప్పల్ నూతన మేయర్‌గా తోటకూర అజయ్ యాదవ్> బాలాపూర్‌‌లో ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు> రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత > ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి> గచ్చిబౌలి DLF వద్ద అగ్ని ప్రమాదం > దుండిగల్‌లో 3.8 కిలోల గంజాయి సీజ్