Hyderabad

News February 11, 2026

GHMC స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్ రంజన్

image

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను బాధ్యతలు స్వీకరించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలనా బాధ్యతల నిర్వహణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. GO 203 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి 3 కార్పొరేషన్ల బాధ్యతలు ఆయన చూసుకోనున్నారు.

News February 11, 2026

GHMCపై కొత్త బాస్‌ల సంతకం

image

GHMC 3 ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్‌గా సృజనతో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్యర్యంలో బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వారు పేర్కొన్నారు. నగర పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.

News February 11, 2026

HYD: వాటర్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీరే!

image

నగరంలో నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ బదిలీ అయ్యారు. హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సామ్రాట్ అశోక్ నామ బదిలీ కాగా, సైబరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎం.సంతోష్ బదిలీ అయ్యారు. లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశికిరణచారి బదిలీ అయ్యారు. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

News February 11, 2026

HYD: హోటల్‌ గదిలో అన్నాచెల్లెలి మృతదేహాలు

image

వారణాసి కాంట్ ప్రాంతంలోని సిట్ ఇన్ హోటల్‌లో 4 రోజులుగా బస చేస్తున్న HYD లక్డికాపూల్‌కు చెందిన గణేశ్ గౌడ్, అతడి సోదరి లక్ష్మీదేవి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు గది తలుపులు తెరవకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపు తెరవగా.. ఇద్దరి నోటి నుంచి నురుగు రావడం, అక్కడ విషం ప్యాకెట్ లభించడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 11, 2026

GHMCకి ముచ్చటగా ముగ్గురు ఫిక్స్

image

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించగా వీటికి కొత్త కమిషనర్ల నియామకాలు జరిగాయి. GHMC (సెంట్రల్ HYD) కమిషనర్‌గా ఆర్‌వీ కర్ణన్ కొనసాగుతారు. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన, మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియలో మరో పది మంది IAS అధికారులు బదిలీ అయ్యారు.

News February 11, 2026

HYD: లక్షల్లో లోన్.. క్లిక్ చేస్తే క్లీన్!

image

HYDలో లక్షల్లో లోన్ ఇస్తాం సార్ అంటూ.. మాయ మాటలు చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షల లోన్ ఇస్తామని మెసేజ్‌లు పంపుతున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేశారో.. మీ పని అంతే! అకౌంట్ ఖాళీ చేసేస్తున్నారు. ఏడాది కాలంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. HYD పరిధిలో 2, సైబరాబాద్- 216, రాచకొండ-125 లోన్‌లకు సంబంధించిన కేసులు సైబర్ క్రైమ్ PSలో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News February 11, 2026

పురపోరు: కొడంగల్ వైపు ‘ఉమ్మడి’ చూపు!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి తుది దశకు చేరింది. నేడు 7AM గంటల నుంచి పోలింగ్ మొదలుకానుంది. రంగారెడ్డిలో 6, వికారాబాద్‌లో 4, మేడ్చల్‌లో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల తరఫున CM, మంత్రులు, MP, MLAలు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక పుర ప్రజలను మెప్పించిన నాయకుడు ఎవరనేది ఎల్లుండి కౌంటింగ్‌లో తేలనుంది. CM ఇలాకాలో ఓటరు నాడి ఎటనేది ఆసక్తిగా మారింది.

News February 11, 2026

HYD: లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారా?

image

మార్చి 1, 2026 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇక మీదట నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు RTA నుంచి తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేని డ్రైవర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బైక్ ఓనర్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చినా నేరమేనని పోలీసులు హెచ్చరించారు.

News February 10, 2026

HYD: దోమలు నిద్రపోనివ్వడం లేదు!

image

సిటీలో IT అంటే సాఫ్ట్‌వేర్ అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అది ‘ఇంటెన్సివ్ టెర్రర్’గా మారింది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో దోమల దండయాత్ర మామూలుగా లేదు. 2024లో ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీలు ప్రైవేట్ ఫాగింగ్ కోసం నెలకు లక్షన్నర ఖర్చు చేస్తే ఇప్పుడు మూడున్నర లక్షలకు చేరింది. పేరుకే హైటెక్ సిటీ కానీ.. పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లు దోమల ఫ్యాక్టరీలుగా మారాయి. మున్సిపల్ మందులకు ఈ దోమలు చావట్లేదట మరి!

News February 10, 2026

HYD: జ్యోతిర్లింగాల దర్శనం.. FEB 21 నుంచి షురూ

image

దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ FEB 21 నుంచి 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచీ, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శంచుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. పెద్దలకు రూ.14,700లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్‌ ధరను అధికారులు నిర్ణయించారు. SHARE IT.