India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

CYB మున్సిపల్ కార్పొరేషన్ (CMC) మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ కార్పొరేషన్‌లో 3 జోన్లు ఉన్నాయి.
శేరిలింగంపల్లి ZONE: నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు ఉన్నాయి.
కూకట్‌పల్లి ZONE: మాదాపూర్, అల్వీన్‌కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్లు ఉన్నాయి.
కుత్బుల్లాపూర్ ZONE: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్లు ఉన్నాయి.

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించారు. మల్కాజిగిరిలో 3 జోన్లు(మల్కాజిగిరి, Uppal, LBనగర్), 14 సర్కిళ్లు, 74 వార్డులున్నాయి (కార్పొరేటర్). HYDలో 6 జోన్లు(శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, SEC BAD), 30 సర్కిళ్లు, 150 వార్డులున్నాయి.సైబరాబాద్‌లో 3 జోన్లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 16 సర్కిళ్లు, 76 వార్డులున్నాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులు.

సిటీ పరిధి పెరిగింది.. నీళ్ల కనెక్షన్లు పెరిగాయి. అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసేందుకు సర్కారు ఇద్దరు కొత్త బాసులను దింపుతోంది. HMWS&SB సేవలు ORR దాకా విస్తరించడంతో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. జాయింట్/అదనపు సెక్రటరీ క్యాడర్ అధికారులను డెప్యుటేషన్‌పై నియమించనున్నారు. కనెక్షన్లు 14.50 లక్షలకు చేరడంతో 3 స్వతంత్ర విభాగాల ద్వారా మెరుగైన సేవలు అందిస్తారు.

మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 103 ఏళ్ల రామయ్య తన ఓటు హక్కును వినియోగించుకుని యువకులకు ఆదర్శంగా నిలిచారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌కి చెందిన రామయ్య అదే వార్డులోని పోలింగ్ కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వీల్ ఛైర్‌పై వచ్చి తన వార్డుకు చెందిన తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. ఓటు విలువ ఇప్పటికైన కొందరు తెలుసుకోవాలని సూచించారు.

నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీకి నేడు 300 డివిజన్లతో భారీ విస్తరణ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు సీఎంగా వైఎస్ఆర్ నేడు రేవంత్ రెడ్డి హయాంలో మార్పులు జరిగాయి. ఈ 12 ఏళ్ల కాలంలో మహానగరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో రైలు, బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు.. ఇలా అనేకం నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయి.

వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను త్వరలో వేలం వేయనున్నట్లు సైబరాబాద్ ఎంటీఓ-2 వీరలింగం తెలిపారు. దాదాపు 304 వాహనాలు పట్టుబడ్డాయని.. వీటిని ఆన్‌లైన్ ద్వారా వేలంలో విక్రయిస్తామని వివరించారు. అయితే ఈ వాహనాల యజమానులు తమ యాజమాన్య వివరాలకు సంబంధించి డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు వారికి స్వాధీనం చేస్తామని తెలిపారు. వివరాలకు 8712663357 నంబరులో ఫోన్ చేయాలన్నారు.

మహానగరం మూడుగా విడిపోయింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయి. అయితే ఇపుడు లెక్కలు.. అకౌంట్లపై అధికారులు దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ నుంచి పూర్తిగా విడిపోవడంతో సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవనున్నారు. ఆదాయ, వ్యయాల లావాదేవీలు ఇకనుంచి కొత్త అకౌంట్ల ద్వారానే చేయనున్నారు.

గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్‌గా IAS సృజన నేడు బాధ్యతలు స్వీకరించారు. 2013 TG క్యాడర్‌కు చెందిన ఈమె గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా, NTR జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఈమె పరిధిలోకి వస్తాయి.

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 102 ఏళ్లున్న దాసరి ఎల్లమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎందుకు వేయాలని భావిస్తున్న ఎందరికో ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఎల్లమ్మ చెబుతున్నారు.

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, మాదాపూర్‌లోని ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, నేరుగా తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లు లేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.
Sorry, no posts matched your criteria.