India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 16, HYD సార్టింగ్ డివిజన్‌లో 12, HYD సౌత్ ఈస్ట్ డివిజన్‌లో 25, సికింద్రాబాద్ డివిజన్‌లో 62 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు.
SHARE IT
స్వచ్ఛ ఆటోల పనితీరుపై దృష్టి పెట్టాలని ZCలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఎంటమాలజి చీఫ్‌లతో ఆమె సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆటో సిబ్బంది హాజరును పర్యవేక్షించాలన్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలు రాత్రిపూట మాత్రమే చెత్త సేకరించేలా చూడాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద పెద్ద సంపుల నిర్మాణానికి టెండర్లు పిలవాలన్నారు.
శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోనాల వేడుకల నిర్వహణ కోసం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెక్కులను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆషాఢ మాసబోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతం లో కంటే ఎక్కువ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేస్తే .. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసిందన్నారు.
గచ్చిబౌలిలోని DLF బిల్డింగ్ గేట్ నంనంబర్-3 వద్ద గోల్కొండ చెఫ్స్ పక్కన టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్‌లోని కిచెన్‌లో మంటల చెలరేగాయని ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కిచెన్ నుంచి అందరిని బయటికి పంపడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్‌కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘నా కొడుకునే రిమాండ్ చేస్తారా మీకెంత ధైర్యం ఉండాలి’ అంటూ ఓ హోంగార్డు PSలో హల్‌చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్‌కు చెందిన ఏ.వెంకటేశ్‌ను చైన్‌స్నాచింగ్ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి హోంగార్డుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్థానిక PSలోకి వెళ్లి ఏకంగా క్రైమ్ సీఐ శ్రీనివాస్‌నే ‘నీ అంతు చూస్తా’ అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ రచ్చచేశారు. అతడి మీద కూడా కేసు నమోదైంది.
ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
హైదరాబాద్‌లో పూలకు కేరాఫ్ అడ్రస్ గుడిమల్కాపూర్ మార్కెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన వ్యాపారస్థులు పూల క్రయవిక్రయాలు చేస్తుంటారు. పండగ వచ్చింది అంటే చాలు ఇక్కడ సందడిగా మారుతుంది. రూ. లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. 11 ఎకరాల్లో విస్తరించి ఉన్న మార్కెట్ వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తుంది. ఇక బోనాల సీజన్ కావడంతో రెట్టింపు వ్యాపారం జరగనుంది.
HYDకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్‌గూడ సభలో ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్‌పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?
> ప్రజాభవన్ నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి > నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం > పీవీఆర్ మాల్‌లో వాటర్ లీక్.. ఆందోళనకు దిగిన ప్రేక్షకులు > రాంనగర్‌లో నలుగురి ప్రాణాలు కాపాడిన యువకులు > బీబీకా ఆలావాను సందర్శించిన మాజీ హోమ్ మంత్రి మహమూద్ అలీ > మేక బ్రతుకు పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ > పంజాగుట్టలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
Sorry, no posts matched your criteria.