Hyderabad

News March 31, 2025

HYD: ఎన్నికల్లో BJP 100% పోటీ: బండి సంజయ్

image

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఓటింగ్‌లో కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని, తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ సమీకరణాన్ని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 100% పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

News March 31, 2025

HYD: తల్లితో సంబంధం.. పొడిచి చంపిన కొడుకు

image

కర్మన్‌ఘాట్‌లో దారుణఘటన వెలుగుచూసింది. జానకి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకటేశ్వర్లుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత 8 నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సదరు మహిళ కుమారుడు పవన్‌కు వెంకటేశ్వర్లు మధ్య గత రాత్రి గొడవ జరిగింది. కోపంతో కత్తితో పొడిచిన పవన్ పరారీ అయ్యాడు. బాధితుడిని ఉస్మానియాకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

News March 31, 2025

OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

image

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News March 31, 2025

HYD: ‘స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించవద్దు’

image

తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది సందర్భంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు స్వస్తి పలకాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించ వద్దని ‘మాచన’ స్మోకర్స్‌ను కోరారు. పొగాకు ధూమపానం అలవాట్లు జీవితానికి చేదు అనుభవం మిగిలిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 30, 2025

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 222 మంది చిక్కారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 222 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 163 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 48 నాలుగు చక్రాల వాహనాలు, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 30, 2025

తెలంగాణ భవన్‌లో పంచాంగం.. మళ్లీ సీఎంగా కేసీఆర్

image

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అర్చకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

News March 30, 2025

హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీ..!

image

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎండ తీవ్రతతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మరికొందరు ఉగాదికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాలు బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 30, 2025

HYD: బాలుడిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

HYDలో బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడింది. బాలానగర్ PS పరిధిలో 2022లో పోక్సో కేసు నమోదైంది. కేసు పూర్తి వివరాలు.. ఫిరోజ్‌గూడకు చెందిన బర్కత్ అలీ(21) ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. తాజాగా కూకట్‌పల్లి‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ విక్రమ్‌తో కూడిన ధర్మాసనం దోషిగా తేల్చి, 20 సం.రాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

News March 30, 2025

HYD: పంజాగుట్ట కేసు.. ఇన్‌స్టా రీల్స్‌లో మార్పు!

image

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.

News March 30, 2025

HYD: వెల వెలబోతున్న మాంసం షాపులు!

image

మాంసం దుకాణాలపై ఉగాది పండుగ ప్రభావం చూపుతోంది. నగరశివారు మూడుచింతలపల్లిలో చికెన్, మటన్ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెల బోయాయి. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ, ఈ ఆదివారం తెలుగు నూతన సంవత్సరం కావడంతో ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేస్తున్నారు. దీంతో నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. గిరాకీ లేదని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.

error: Content is protected !!