Hyderabad

News March 19, 2024

HYD: ‘CM రేవంత్‌రెడ్డి సార్ మా నాన్నను కాపాడండి’

image

HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్‌నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.

News March 19, 2024

ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 19, 2024

HYD: FREE గ్యాస్.. ఖాతాల్లో రాయితీ నగదు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు HYD, RR, MDCL జిల్లాల పరిధిలో సుమారు 8 లక్షల మందికి రాయితీ డబ్బు అందినట్లు ప్రాథమికంగా వారు అంచనా వేస్తున్నారు. రీఫిల్లింగ్ బుక్ చేసిన నాటి నుంచి 3 రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. రోజూ 20 వేల మంది లబ్ధి పొందుతున్నారని అంచనా.

News March 19, 2024

HYD: 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

తెలంగాణలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం HYD విద్యానగర్ బీసీ భవన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో కేవలం 8 కార్పొరేషన్లు మాత్రమే ఇప్పటివరకు ప్రకటించారని, మిగతా కులాలన్నింటికీ కార్పొరేషన్లను ప్రకటించాలని కోరారు.

News March 19, 2024

HYD: రూ.16,43,300 నగదు పట్టివేత: కమిషనర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్ టీమ్స్ మంగళవారం రూ.16,43,300 నగదుతో పాటు రూ.10,250 విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీస్, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News March 19, 2024

ఓయూ బీసీఏ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News March 19, 2024

HYD: ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది: కిషన్ రెడ్డి

image

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 19, 2024

HYD: కాంగ్రెస్‌లో చేరిన శ్రీగణేశ్ 

image

లోక్‌సభ ఎన్నికల వేళ BJPకి బిగ్ షాక్ తగిలింది. BJP సీనియర్ నేత, ఆ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ నేడు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. సీనియర్ నేతలు మహేశ్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా గత ఎన్నికల్లో శ్రీగణేశ్‌ పై BRS నేత లాస్య నందిత గెలిచారు. కాంగ్రెస్ తరఫున గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేశారు.

News March 19, 2024

ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ VS ముంబై ఇండియన్స్

image

ఈనెల 27న HYD ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి అధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. స్టేడియం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఏరివేతకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

News March 19, 2024

మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్

image

గ్రేటర్ HYDలోని మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పనులు చేపట్టింది. ప్రమాదకరంగా ఉన్న నాలాలు, మ్యాన్‌హోళ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రక్షణ చర్యలపై సర్వే చేస్తున్నారు. 2023-24లో రూ.543.26 కోట్లతో 888 పనులను ఆమోదించగా అందులో 311 రూ.162.53 కోట్లతో పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.