India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేల కలుషితమవుతున్న వేళ ‘మైకోరైజా’ అనే మేలు చేసే శిలీంధ్రాలు రైతులకు వరంగా మారనున్నాయి. ఈ ప్రత్యేక శిలీంధ్రాలు భూమిలోని పోషకాలను వేర్లకు అందించి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించే అవకాశం లభిస్తుంది. దీంతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ విషం లేని ఆహారాన్ని అందించనుంది.

స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హబీబ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి సీట్లు రిజర్వు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 9182628275 నంబరును సంప్రదించాలని కోరారు.

మల్లారెడ్డి కాలేజ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఒకటిన్నర లీటర్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు అమ్ముతుండగా, నలుగురు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ నుంచి ఒడిశాకు వెళ్లి గంజాయి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు.

బిర్లా మందిర్.. ఎత్తైన కొండపై నగరవాసులకు ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలిగిపోతోంది. హుస్సేన్‌సాగర్‌కు దక్షిణాన నౌబత్‌పహాడ్, కాలాపహాడ్ కొండలపై కొలువై కళకళలాడుతోంది. 1976లో రాజస్థాన్ తెల్ల పాలరాయితో బిర్లా ఫౌండేషన్ నిర్మించింది. ఉత్తర, ఉత్కల్, ద్రవిడ వాస్తు శైలుల సమ్మేళనంగా నిర్మించారు. ఈ గుడిలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి రూపం తిరుమలలోని స్వామిని స్మరింపజేస్తుంది. నగర శోభను మరింత పెంచుతోంది.

HYDలో బోరాబండ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

HYDలో నివాస స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి TGRSCL అవకాశం కల్పించింది. తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని 137 బహిరంగ ప్లాట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వేలం తేదీలు: ఫిబ్రవరి 7, 8.
ధర: గజం కనీస ధర రూ. 20,000 నుంచి రూ. 30,00గా నిర్ణయించారు. (మార్కెట్ రేట్లతో పోలిస్తే తక్కువ)
రిజిస్ట్రేషన్: ఆసక్తి గల వారు ఫిబ్రవరి 6 లోపు మీ-సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవాలి.

సిటీ కుర్రాళ్ల సోషల్ లైఫ్ ఇప్పుడు రూటు మార్చింది. వీకెండ్ వస్తే కేవలం డాన్స్ ఫ్లోర్ల మీద స్టెప్పులేయడమే కాదు.. చేతిలో బీర్ గ్లాసు పట్టుకొని ‘స్ట్రింగ్ థియరీ’ వంటి కఠినమైన సైన్స్ ముచ్చట్లు వినడం ఇప్పుడు GEN-Zలో కొత్త క్రేజ్. ‘పింట్ ఆఫ్ వ్యూ’ వంటి ఈవెంట్లే దీనికి సాక్ష్యం. సైన్స్, హిస్టరీ, క్వాంటం ఫిజిక్స్ వంటి సీరియస్ విషయాలను చిల్ అవుతూ నేర్చుకోవడానికి మన HYD కుర్రాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.