Hyderabad

News January 22, 2026

HYD: PSకు రాకుండా కంప్లైంట్ ఇవ్వొచ్చు: సీపీ

image

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్‌కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్‌కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్‌లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

News January 21, 2026

HYDలో భారీ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!

image

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ బుద్వేల్‌లో రూ.488crతో ప్రభుత్వం Trumpet Interchange కట్టబోతోంది. దీంతో గచ్చిబౌలి-ఎయిర్‌పోర్ట్‌కి ఈజీగా వెళ్లొచ్చు. బంజారాహిల్స్-శిల్పా Layout వరకు రూ.1,656crతో ఎలివేటెడ్ కారిడార్‌, మణికొండ-కోకాపేటలో రూ.110crతో పైప్‌లైన్ రోడ్డును 6 లేన్లుగా మారుస్తున్నారు. గచ్చిబౌలిలో బాటిల్‌నెక్ సమస్య తీర్చడానికి రూ.26.50crతో ORRను వెడల్పు చేయనున్నారు.
NOTE: JAN 27న టెండర్ల ఆహ్వానం.

News January 21, 2026

HYDలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

image

ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్‌మెంట్ పర్మిషన్ కావాలన్నా ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. టౌన్ ప్లానింగ్ విభాగం March 2026 నుంచి ‘BuildNow’ అనే ఫుల్ ప్లెడ్జ్ అప్లికేషన్‌ను తెస్తోంది. ఇది మామూలు యాప్ కాదు. AIతో పనిచేసే అత్యాధునిక టెక్నాలజీ. డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో పెడితే చాలు AI టూల్స్ అన్నీ చెక్ చేసి ఇట్టే అప్రూవల్ ఇచ్చేస్తాయి. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం BuildNowకు శ్రీకారం చుట్టింది.

News January 21, 2026

HYDలో 5 లక్షలకు చేరువలో కుక్కల సంఖ్య

image

నగరంలో కుక్కల జనాభా బెంబేలెత్తిస్తోంది. మున్సిపాలిటీల విలీనం తర్వాత GHMC పరిధిలో వీధి కుక్కల సంఖ్య 4.86 లక్షలకు చేరుకుంది. గతంలో ఈ సంఖ్య 3.86 లక్షలుగా ఉండేది. మొత్తం కుక్కలలో 80 శాతం వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కుక్కల స్వైరవిహారం తగ్గడం లేదు. వార్డుల విలీనంతో పెరిగిన బెడద, 80 శాతం స్టెరిలైజేషన్ జరిగిందన్న మాట నిజమేనా? కామెంట్ చేయండి!

News January 21, 2026

HYDలో ఫిబ్రవరి 12 తర్వాత కొత్త సీన్?

image

నగరంలో పాలనా ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైంది. అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడనప్పటికీ FEB 12 తర్వాత ముగ్గురు అధికారులు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. CYB కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఎన్నికలు ముగిసే వరకు GHMC కమిషనర్‌గా RV.కర్ణన్ చక్రం తిప్పనున్నారు. వార్డుల విభజన తర్వాత సిటీ రూపురేఖలు మారతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

News January 21, 2026

HYD: బెస్ట్‌ రీల్‌కు రూ.10,000

image

హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల మేర ఉన్న 500లకు పైగా వీకెండ్ స్పాట్స్ ఇప్పుడు మీ కెమెరా కోసం వెయిట్ చేస్తున్నాయి. FTCCI నిర్వహిస్తున్న ఈ మెగా రీల్స్ కాంటెస్ట్ గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. పాత కోటలు, జలపాతాలు, ఫేమస్ దాబాల అందాలను 60 సెకన్ల వీడియోలో బంధించండి. బెస్ట్ రీల్స్‌కు రూ.10,000 వరకు నగదు బహుమతులతో పాటు క్రేజీ గుర్తింపు పొందే ఛాన్స్! తెలంగాణ టూరిజాన్ని మీ స్టైల్‌లో వైరల్ చేయండి.

News January 21, 2026

మరో అద్భుతమైన వేడుకకు సాక్ష్యం కానున్న మన HYD

image

HYD నగరం రంగులు, తాళాలు, సంప్రదాయాలు, ఐక్యతతో కూడిన ఓ అద్భుతమైన వేడుకకు సాక్ష్యం కానుంది. గిగ్గిల్‌మగ్ ఈవెంట్స్ (GiggleMug Events) సమర్పణలో, ఎత్నిక్ ఫెస్ట్ 2026ను జనవరి 31న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిదాంట్లోనూ మన సంస్కృతి ఉట్టిపడేలా ఈ ప్రోగ్రాం సాగనుంది. భారతదేశపు సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని రూపొందించారు.

News January 21, 2026

పంచాయతీ రాజ్‌కు పురిటిగడ్డ షాద్‌నగర్..!

image

దేశ చరిత్రలో షాద్‌నగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1959 అక్టోబర్ 14న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడే దేశంలోనే మొదటి ‘బ్లాక్ డెవలప్‌మెంట్ సెంటర్’ (పంచాయతీ రాజ్)ను ప్రారంభించారు. నాటి సర్పంచ్ అప్పారెడ్డి హయాంలో జరిగిన ఈ పరిణామం భారతదేశ గ్రామ స్వరాజ్య చరిత్రలో షాద్‌నగర్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది.

News January 21, 2026

విద్యార్థులకు ALERT.. ఏకలవ్య పాఠశాలల్లో ADMISSIONS

image

TGలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 1380 సీట్లను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 29న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు https://tsemrs.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT.

News January 21, 2026

HYD: ఈ నగరానికి ఏమైంది.. ఒకేరోజు 3 హత్యలు..?

image

వరుస హత్యలతో HYD హడలెత్తుతోంది. అక్రమ సంబంధాలు, గంజాయి మత్తు మానవత్వాన్ని దహించేస్తోంది. మంగళవారం జరిగిన 3 హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. జవహర్‌ నగర్‌లో గంజాయి మత్తులో కన్నతల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చాడు. కూకట్‌పల్లిలో జల్సాలకు అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి ఉసురు తీసింది కసాయి భార్య. బోరబండలో భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపాడో <<18912212>>దుర్మార్గపు భర్త.<<>> నేరచీకట్లలో నగరం కమ్ముకుపోతోంది.