India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జీహెచ్ఎంసీ పునర్విభజనతో జలమండలి విస్తరణ కూడా షురూ కానుంది. శివారు ప్రాంతాల విలీనంతో జలమండలి తన సేవలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటుతో సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 12 కొత్త జోన్లు, 60 సర్కిల్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, జలమండలి విస్తరణకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.

మహానగరం పరిధి పెరగింది. దీంతో జలమండలి కూడా పునర్విభజన అనంతరం ఏర్పడ్డ గ్రేటర్ కు నీటి సరఫరా చేయనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సర్కారుకు పంపినట్లు తెలిసింది. అయితే 2053 KM విస్తరించిన నగరానికి ఒక్క వాటర్ బోర్డు నీటి సరఫరా సాధ్యమా అనే అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే నీటి సమస్యలు ఉత్పన్నమవుతుంటే వేల కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం పెరిగింది. వేసవి ఎండలు మొదలు కాకముందే విద్యుత్ వినియోగం పెరగడంపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఒక్కరోజు 3,364 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గతేడాది వేసవిలో 4,190 నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది మరింతగా వినియోగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్‌లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.

‘కాలాపానీ’ అనగానే అండమాన్ గుర్తుకొస్తుంది. కానీ దాని రూపకల్పనకు మన HYDలోని ఓ జైలు ఆధారమైందన్న విషయం చాలామందికి తెలియదు. దీనిని సికింద్రాబాద్ తిరుమలగిరిలో 1858లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. 20,344 గజాల విస్తీర్ణంలో పచ్చీస్ ఆకారంలో, 75 చీకటి గదులతో ఈ కారాగారాన్ని కట్టించారు. ఇందులో 500 మందికిపైనే ఉరేశారు. 1994 వరకు జైలుగా వినియోగించారు. దీనినే నమూనాగా తీసుకుని 1906లో ‘కాలాపానీ’ని నిర్మించారు.

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేస్తే జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందొచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానపు ఘట్టాలు సహా ఇతర వివరాలను నేరుగా వాట్సాప్‌లోనే చూడ

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్‌కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్‌కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్‌లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

Sorry, no posts matched your criteria.