Hyderabad

News May 18, 2024

REWIND-2019: చేవెళ్లలో కాంగ్రెస్ ఓటమి!

image

చేవెళ్లలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి(INC)పై రంజిత్ రెడ్డి (BRS) 14,317 ఓట్ల మెజార్టీతో‌ గెలిచారు. జనార్థన్ రెడ్డి(BJP) 3వ స్థానంలో నిలిచారు. ఎన్నికల‌కు ముందు విశ్వేశ్వర్ రెడ్డి(BJP), రంజిత్ రెడ్డి (INC), జ్ఞానేశ్వర్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 18, 2024

HYD: రూ.60 లక్షలు సేఫ్..! 

image

సైబరాబాద్‌లో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు. తాము మహారాష్ట్ర పోలీసులమని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డట్లు బాధిత మహిళకు బెదిరింపు కాల్స్ చేశారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇస్తే కేసు క్లియర్ అంటూ నమ్మించి ఆమె ఖాతా నుంచి రూ.60 లక్షలు కొట్టేశారు. వెంటనే సదరు మహిళ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా గోల్డెన్ అవర్‌ని వాడినందుకు గంటలోనే రూ.60 లక్షలను పోలీసులు నిలుపుదల చేయించారు.

News May 18, 2024

HYD: RTC లహరి AC బస్సుల్స్ స్నాక్స్ బంద్..!

image

లహరి AC బస్సులను రాష్ట్రంలో TSRTC ఆధ్వర్యంలో నడిపిస్తోంది. ఈ బస్సులో ప్రయాణించే వారికి స్నాక్స్ బాక్స్ అందిస్తారు. కానీ..HYD MGBS నుంచి మే 16న ఖమ్మం వెళ్లిన ఓ ప్రయాణికునికి అందించలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులను అడగగా.. మే 15 నుంచి స్నాక్స్ బాక్స్ బంద్ చేశామని తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు నిలిపి వేశామని, ఒక్కో ప్రయాణికుడిపై రూ.30 ఛార్జీ తగ్గించి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

News May 18, 2024

HYD: ఎక్కడ రైలెక్కినా AIRPORT వెళ్లేలా రూట్..!

image

HYDలోని మొదటి 3 దశల మెట్రో కారిడార్లు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, రాయదుర్గం నుంచి నాగోల్, JBS నుంచి MGBSతో నూతన ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్‌లో రైలెక్కినా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు రెండో దశలోని మెట్రో రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

News May 17, 2024

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు..

image

హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. 

News May 17, 2024

HYD: అంతర్జాతీయ స్థాయిలో కోహెడ పండ్ల మార్కెట్..!

image

HYD శివారు హయత్‌నగర్ పరిధి కోహెడ పండ్ల మార్కెట్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మార్చనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులకు అడ్డాగా మారుస్తామని అధికారులతో అన్నారు. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

News May 17, 2024

HYD: 39 కొత్త STPలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

image

మూసీ ప్రక్షాళనకు ముందడుగు పడింది. HYDలో రూ.4 వేల కోట్లతో 39 కొత్త STPలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మురుగు నీటి శుద్ధికి ఇప్పటికే 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లు నిర్మాణంలో ఉండగా.. మరో 39 ఎస్టీపీలకు సాంకేతిక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR)లకు ఆమోదముద్ర వేసింది. వీటితో మూసీలోని ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయనున్నారు.

News May 17, 2024

HYD: మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

HYD కార్మికనగర్‌లో <<13251869>>మేకప్ ఆర్టిస్ట్ చుక్కా చెన్నయ్య<<>> హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసులు తెలిపిన వివరాలు.. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్‌నగర్‌ వాసి సంపత్ యాదవ్ (19)కు పరిచయముంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి స్థానిక నిమ్స్‌మే గ్రౌండ్‌లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News May 17, 2024

HYD: రూ.50 కోసం గొడవ.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

మద్యం తాగేందుకు రూ.50 కోసం గొడవ పడి గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. అల్వాల్ పోలీసుల వివరాలు.. మచ్చబొల్లారంలో నివాసముండే సురేశ్(45) పెయింటింగ్ పని చేస్తున్నాడు. సూర్యనగర్‌లో నివాసముండే భరత్‌ను 13న మద్యానికి డబ్బులు లేవని రూ.50 ఇవ్వాలని అడిగాడు.దీంతో తరచూ ఎందుకు అడుగుతున్నావని భరత్ గొడవకు దిగాడు. మాటమాట పెరిగి భరత్ సురేశ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సురేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.

News May 17, 2024

HYD: 19 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

image

లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. నగర పరిధిలోని 4 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 29 అసెంబ్లీ సెగ్మెంట్లకు 19 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.