Hyderabad

News January 17, 2026

HYD: ఫేక్ టాబ్లెట్ గుర్తుపట్టడం ఎలా..?

image

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.

News January 17, 2026

HYD: ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు

image

HYDలో డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వైస్‌ ఛాన్స్‌లర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీ చదువుతున్న 690 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

News January 17, 2026

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హౌస్ అరెస్ట్

image

లష్కర్ ప్రాంతంలో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News January 17, 2026

HYDలో పలు చోట్ల ఫేక్ టాబ్లెట్స్.. జాగ్రత్త..!

image

HYDలో DGCA రిపోర్టు ప్రకారంగా.. తప్పుడు ఔషధ కంపెనీల పేర్లతో పలు మెడికల్ షాపుల్లో తప్పుడు లేబుల్స్ ఔషధాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాలు దీని వెనుక ఉన్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

News January 17, 2026

సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

image

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

News January 17, 2026

హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

image

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News January 17, 2026

మేడారంలో రేపు రాష్ట్ర కేబినెట్‌ కీలక సమావేశం

image

రేపు మేడారంలో రాష్ట్ర కేబినెట్‌ కీలక సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయాన్ని దాటి తొలిసారిగా కేబినెట్‌ సమావేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే MPTC, ZPTC, మున్సిపల్‌ ఎన్నికలు, రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

News January 17, 2026

బీఆర్‌ఎస్‌ MLAలు, MLCలతో నేడు KTR కీలక భేటీ

image

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.

News January 17, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందంటే..?

image

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ బాలాపూర్‌లో శనివారం తెల్లవారుజామున 254కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.

News January 17, 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాకు నేడు CM రేవంత్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.