India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ నగరానికి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్రభారతిలో ఈ స్వర విందు జరగనుంది. హిందుస్థానీ గాత్ర దిగ్గజం పండిట్ జయతీర్థ మేవుండి, కర్ణాటక వేణుగాన విద్వాంసుడు శశాంక్ సుబ్రమణ్యం పోటీపడి వినిపించే ‘జుగల్బందీ’ హైలైట్ కానుంది. తబలాపై వి.నరహరి, మృదంగంపై సతీశ్ పత్రి లయ విన్యాసాలు చేయనున్నారు. బుక్‌మైషోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. DGP ఆదేశాల మేరకు 20 మంది IPSలు బదిలీ అయ్యారు. గజరవు భూపాల్, అభిషేక్ మహంతి, భాస్కరన్, చందనా దీప్తి, అన్నపూరణ, రహుల్ హెగ్డే, అపూరవరవు, బాలస్వామి, వెంకటేశ్వరులు, చైతన్య కుమార్, అవినాశ్ కుమార్, కాజల్, శేషాద్రిని రెడ్డి, కంకనాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, శ్రీనివాసులు, రంజన్ రథన్ కుమార, శ్యామ్ సుందర, అశోక్, బాలకోటి బదిలీ అయ్యారు.

IIIT-H వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్‌ను లాంచ్ చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండానే అడ్మిషన్ పొందే ఈ రెండేళ్ల కోర్సును, ఉద్యోగం చేస్తూనే నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12లోపు dfl.iiit.ac.in లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.4 లక్షల ఫీజు. ఏప్రిల్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
SHARE IT

SEC నిబంధనల ప్రకారం GHMC మేయర్ పదవి మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. గతంలో MCHకు రాణి కుముదిని దేవి తొలి మహిళా మేయర్. ఆ తరువాత సరోజినీ, కుముద్ నాయక్ నగరాన్ని పాలించారు. GHMC ఏర్పడ్డాక 2007లో TDP నుంచి సరస్వతి దేవి మేయర్ అయ్యారు. ఆ తర్వాత బండ కార్తీక రెడ్డి సేవలు అందించగా, ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మి 2021 నుంచి కొనసాగుతున్నారు. ఇలా మేయర్ పీఠంపై మహిళల ముద్ర ఎప్పట్నుంచో ఉంది!

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

HYD మెట్రోలో కొత్త అధ్యాయం మొదలైంది. L&T కున్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తూ, మరో ₹2,000 కోట్లను వాటా కింద చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీంతో మెట్రో నిర్వహణ, టికెట్ ధరలు, విస్తరణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. ఈ ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేసి మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నేడు పర్యాటక శాఖ నిర్వహించే ‘డ్రోన్ షో’కు సర్వం సిద్ధమైంది. ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే స్లాట్లన్నీ నిండిపోయినందున, రిజిస్ట్రేషన్ లేని వారు స్టేడియం వద్దకు రావొద్దని కోరారు. ఆ విన్యాసాలను మిస్ కాకుండా ఉండటానికి పర్యాటక శాఖ అందించే లైవ్ లింక్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.