India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగరం మరో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు విమానాల ప్రదర్శన నిర్వహించనున్నారు. వింగ్స్ ఇండియా పేరిట నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ కంపెనీలు తమ విమానాలను ప్రదర్శననున్నాయి. మొదటి రెండు రోజులు బిజినెస్ పీపుల్‌కు, తరువాతి రెండు రోజులు సిటీ ప్రజలకు విమానాలను చూసే అవకాశం ఇవ్వనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ విమానాల ఎగ్జిబిషన్ ఉంటుంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల రిజర్వేషన్లను నిన్న రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ డ్రా తీసి ఖరారు చేయగా మహానగరంలో మాత్రం అది జరగలేదు. పునర్విభజన తరువాత 300 డివిజన్లు ఏర్పాటయ్యాయి. వీటికి ప్రస్తుత కౌన్సిల్ గడువు (ఫిబ్రవరి 10 తరువాత) ముగిసిన తరువాత తీయాలా? లేక మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత తీయాలా? అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ డ్రా ప్రక్రియను నిన్న నిర్వహించలేదు.

మౌని అమావాస్య సందర్భంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. HYD శివారు, దుండిగల్ PS పరిధి డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.

మెగా బల్దియాను 3 కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం రహస్యంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణనే దీనికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీస్ సరిహద్దుల ప్రకారమే కొత్త కార్పొరేషన్ల పరిధి ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. <<18882495>>300 డివిజన్ల<<>> డేటా అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగదు.

TGలోని ఇతర కార్పొరేషన్లలో BC రిజర్వేషన్లు పూర్తయినా GHMCలో మాత్రం ‘ఓటర్ల గణన’ కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. హద్దులు మారిన నేపథ్యంలో ప్రతి డివిజన్‌లో BCల సంఖ్యను తేల్చేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ డిజిటల్ డేటా ఆధారంగానే ఏ వార్డును BCలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. <<18882458>>SMలో<<>> వస్తున్న ఊహాజనిత జాబితాను నమ్మవద్దని ఎన్నికల విభాగం హెచ్చరిస్తోంది.

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.