Hyderabad

News May 9, 2024

HYD: ‘తాడుతో కట్టేసి వ్యభిచారం చేయించింది’

image

HYD యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో <<13213121>>14 ఏళ్ల బాలికను<<>> వ్యభిచార రొంపి నుంచి పోలీసులు కాపాడిన విషయం తెలిసిందే. బాలిక మాట్లాడుతూ.. నిర్వాహకురాలు చిన్నప్పుడే తనను తీసుకొచ్చి పెంచిందని, ఏడాది నుంచి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించిందని తెలిపింది. తాను ఒప్పుకోకపోతే తీవ్రంగా కొట్టి , తాడుతో కట్టేసి, మాట వినలేదని జుట్టు మొత్తం కత్తిరించిందని ఏడుస్తూ చెప్పింది. పోలీసులు బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News May 9, 2024

HYD: డిప్లొమా చేసిన వారికి ఉద్యోగాలు..

image

డిప్లొమా చేసినవారికి రెండు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన HYD బాలానగర్ CITD ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నోటీస్ విడుదలైంది. డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మేకింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని తెలిపారు. CNC మిల్లింగ్ ఆపరేటర్, టర్నింగ్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గలవారు https://forms.gle/zeFFXwpBZkuojgaWA ద్వారా ప్లేస్‌మెంట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 9, 2024

HYD: అమ్మాయిని చేరదీసి.. వ్యభిచార ఊబిలోకి దింపింది!

image

HYD యూసుఫ్‌గూడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు..కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు యువతులు,ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో 14ఏళ్ల బాలిక ఉండగా నిర్వాహకురాలు లక్ష్మిని విచారించారు. చిన్నప్పుడే బాలికను తీసుకొచ్చి పెంచి, బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపినట్లు తెలిపింది. చిన్నారిని రక్షించారు.

News May 9, 2024

HYD: బాచుపల్లి గోడ కూలిన ఘటనలో ఆరుగురు అరెస్ట్

image

HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీశ్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు.

News May 9, 2024

చార్మినార్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్ 

image

పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మినార్ బస్ స్టాండ్ పార్కింగ్‌లో డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వారికి నిషేధిత టైడోల్ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న యాకుత్‌పురకు చెందిన హర్షద్ ఖాన్‌ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద 100కి పైగా ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన మెదడుపై ప్రభావం చూపి మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

News May 9, 2024

HYD: ఇక్కడ ఇంత వరకు BRS గెలవలేదు..!

image

సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా BRS పార్టీ గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 BRS, ఒకటి MIM గెలిచింది. ఇక మల్కాజిగిరిలో 7కు 7 BRS గెలిచింది. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నా ఎంపీలుగా మాత్రం గెలవలేదు. మరి ఈసారి 2ఎంపీ నియోజకవర్గాల్లోనూ BRS గట్టిగా ఉంది. పార్టీని గెలిపించేందుకు KCR, KTR ప్రచారం చేస్తున్నారు. మీ కామెంట్?

News May 9, 2024

HYD: ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ విజయవంతం చేసిన స్ఫూర్తితోనే పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

News May 9, 2024

HYD: స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు లూటీ

image

స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగరానికి చెందిన గృహిణి(64) ఫేస్ బుక్‌లో ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయనే ప్రకటన చూసి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదటగా కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.6.50 లక్షల వరకు యాప్‌లో పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చిన విత్ డ్రా చేసుకోవడానికి రాకపోవడంతో మోసపోయి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 9, 2024

HYD: 24 గంటల్లో రూ.28.43 లక్షలు స్వాధీనం

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.28,43,735 నగదు, రూ.5,55,605 విలువైన ఇతర వస్తువులు, 33.50 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆరుగురిపై FIR  నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల నగదు, రూ.17.93 కోట్ల విలువైన వస్తువులు, 26.83 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 9, 2024

HYD: భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.16 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బాచుపల్లిలో రెండు బైకులపై తరలిస్తున్న రూ.22 లక్షల నగదు పోలీసులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో క్యాష్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.