Hyderabad

News January 13, 2026

హైదరాబాద్: జైళ్లలో Gen Z మెజారిటీ!

image

తెలంగాణ జైళ్ల యాన్యువల్ రిపోర్టు చూస్తే మతిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు బాంబులా పేలగా, తాగి నడిపి 2,833 మంది లోపలికి వెళ్లారు. మొత్తంగా ఖైదీల సంఖ్య 42 వేలు దాటింది. అందులో Gen Z మెజారిటీ ఉండటం కలవర పెట్టే అంశం. 2025 రిపోర్టు ప్రకారం.. 18,737 మంది యువకులు, 654 మంది యువతులు, 22 ఇతరులు కలిపి 19,413 మంది ఖైదీ అయ్యారు. 2024తో పోలిస్తే నేరలు చేసిన వారి సంఖ్య 13.31% శాతం పెరగడం గమనార్హం.

News January 12, 2026

HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

image

HYD హైటెక్‌ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్‌ సాఫ్ట్‌వేర్‌ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!

News January 12, 2026

HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

image

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

image

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేద వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

మృత్యువును ఆపిన ‘డెలివరీ’ బాయ్‌.. HYDలో సెల్యూట్

image

నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే ఓ డెలివరీ బాయ్ మానవత్వంలో అందరికంటే ముందున్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ఆర్డర్ చేసిన విషాన్ని డెలివరీ చేయకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. నగరంలోని మీడియా జంక్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఉదంతం చర్చకు రాగా అక్కడి వారంతా లేచి నిలబడి ఆ యువకుడికి సెల్యూట్ చేశారు. ఈ ‘నిజమైన హీరో’ ఇప్పుడు హైదరాబాదీల ప్రశంసలు అందుకుంటున్నాడు.

News January 12, 2026

HYD: నీటితో ఆటలాడితే.. నల్లా కనెక్షన్ కట్

image

మహానగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలకు సిద్ధమైంది. వాహనాల వాషింగ్‌, గార్డెనింగ్‌, రోడ్లపై నీటిని వృథా చేస్తే రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనుంది. 2సార్లు అవకాశం ఇచ్చి, ఆపై నల్లా కనెక్షన్‌ కట్‌ చేస్తారు. నీటి వృథాపై ఫొటో, లొకేషన్‌తో ‘పానీ యాప్‌’లో సమాచారం పంపేందుకు 10 వేల మంది వాటర్‌ వాలంటీర్లను రంగంలోకి దింపనున్నారు. 15 రోజుల్లో యాప్ అందుబాటులోకి రానుంది.

News January 12, 2026

FLASH: బోరబండలో యువతి మర్డర్

image

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.

News January 11, 2026

HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చెయ్యి కట్!

image

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

News January 11, 2026

HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

image

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.

News January 11, 2026

HYD: ఆ నలుగురు లేకపోయినా!

image

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.