India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

GHMCలో మున్సిపాలిటీల విలీనం తర్వాత అనధికారిక హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనా నిర్మాణాలపై అధికారులు నగరవ్యాప్త స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రజా, రోడ్డు భద్రత, నగర సౌందర్యం కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అన్నీ జోన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన GHMC దశలవారీగా నిరంతరం ఈ డ్రైవ్‌ను చేపడుతుంది. అనధికారిక ప్రకటనలను ఏర్పాటు చేస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించింది.

గత ప్రభుత్వం సేకరించిన 19,333 ఎకరాల ఫార్మా సిటీ భూములను ప్రస్తుత ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చడం న్యాయపరమైన వివాదాలకు దారితీస్తోంది. ఒక నిర్దిష్ట ‘ప్రజా ప్రయోజనం’ కోసం సేకరించిన భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడంపై 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత ప్రాజెక్టును రద్దు చేసినప్పుడు, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది.

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అచ్యుతరావు అన్నారు.

HYD నగర పాలనలో ఒక భారీ శకం ముగిసి, కొత్త అధ్యాయం మొదలైంది. GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ఇప్పటికే 100 % పూర్తయింది. లోపల జరగాల్సిన ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన అంతా సైలెంట్‌గా క్లోజ్ చేసేశారు. వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులు కూడా ముగిశాయి. ముగ్గురు సీనియర్ సిటీ ప్లానర్లకు బాధ్యతలు అప్పగిస్తూ GHMC ఉత్తర్వులు జారీ చేయడం విభజన పూర్తయిందనడానికి బలమైన సాక్ష్యం.

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్-కిడ్’ సిరప్ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.

చారిత్రక నేపథ్యం ఉన్న ఘట్‌కేసర్ (M) ఏదులాబాద్‌లోని మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. TG,APలో ఏకైక ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పలదేశికుడికి ఆండాళ్ దేవికలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించింది. జమీందారుల విరాళాలతో గుడి నిర్మాణం సాధ్యమైంది. సంతానప్రదాయినిగా గాజులమ్మను కొలుస్తారు. నాగుల పంచమినాడు మట్టిగాజులు సమర్పిస్తారు.

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలల్లో యువత చిక్కుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వేదికగా అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆఫర్స్ అంటూ లింకులు పెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల మేడ్చల్(D) మల్లాపూర్‌కు చెందిన ఓవ్యక్తి రూ.42,590 పోగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించినా తగ్గటం లేదు.

సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో CERT ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మెసేజెస్ పంపుతుంది. మీరు సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. బోట్నెట్ ఇన్ఫెక్షన్లు, మాల్వేర్ల నుంచి మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడానికి, CERT-In GoI https://www.csk.gov.inలో ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని HYD టీమ్ సూచించింది.

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ స్కెచ్ వేసి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక్కడి భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లకపోగా, గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే కట్టబెట్టింది. భూములపై పూర్తి పట్టుకోసమే ఈ ‘సూపర్ బాడీ’ని తెచ్చారని, అభివృద్ధి ముసుగులో పల్లెగొంతు నొక్కేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.