India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాజిగిరి ప్రజలు విలక్షణ తీర్పుకు పెట్టింది పేరుగా మారారు. గెలిపించిన పార్టీని వరుసగా మళ్లీ గెలిపించకుండా ప్రతిసారీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించగా ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించారు. మళ్లీ 2019లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించగా ఈసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై మీ కామెంట్?
ఉమ్మడి RR జిల్లా రాజకీయాలను శాసించిన పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీలకు ఎంపీ ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించడం లేదు. తాజాగా పట్నం సునీతారెడ్డి ఓటమే ఇందుకు నిదర్శనం. HYD పార్లమెంట్ స్థానం నుంచి గతంలో TDP అభ్యర్థిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పోటీ చేసి ఓడారు. 2014లో కార్తీక్ రెడ్డి పోటీ చేసి కొండా చేతిలో ఓడారు. దీన్ని బట్టి పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేయడం కలిసిరాలేదని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో సత్తా చాటిన BRS..MP ఎన్నికల్లో మాత్రం మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి,చేవెళ్లలో BRSను గెలిపించేందుకు KTRను నమ్మి KCR బాధ్యతలు అప్పగించారు.అందుకు తగ్గట్లు KTRరోడ్ షోలు, సభలతో హోరెత్తించారు. అయినా ప్రజలు BRSకు నో చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ BRS థర్డ్ ప్లేస్‌లో ఉండడం గమనార్హం.
మల్కాజిగిరి ప్రజలు ఈటలకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించారు. కాగా దేశంలో అతిపెద్ద ఎంపీ స్థానమైన ఇక్కడ 2009లో గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా, 2014లో గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా, 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈటల కేంద్ర మంత్రి అవుతారా వేచి చూడాలి.
హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన కార్వాన్, నాంపల్లి, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, పోలీస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
HYDలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. రాష్ట్రంలోని రూరల్ ప్రాంతాల్లో గెలుపుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి గ్రేటర్‌లో గెలవలేదనే నిరాశ ఉండేది. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజధానిలో ఆయన గెలవడం క్యాడర్‌లో సంతోషం నింపింది. ఖైరతాబాద్ BRS MLA దానం చేరికతో కాంగ్రెస్ బలం 2కి చేరింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి స్వాగతిస్తున్నా అని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లప్పుడూ తానూ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?
ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధి వినాయక హిల్స్‌లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం గమనార్హం.
కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేశ్ బృందం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి CM అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా శ్రీ గణేశ్‌కు సూచించారు. సీఎంను కలిసిన వారిలో జంపన ప్రతాప్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ముప్పడి మధుకర్, సంకీ రవీందర్, ఇటుక రాజు, బద్రీనాథ్ ఉన్నారు
Sorry, no posts matched your criteria.