Hyderabad

News January 5, 2026

HYD: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

సంక్రాంతికి ఊర్లకు వెళ్లే HYD నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇళ్లకు తాళం వేసేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగలు, నగదును ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నియంత్రణకు పౌరుల సహకారం కీలకమని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే ‘డయల్ 100’ను సంప్రదించాలని స్పష్టం చేశారు. పండుగ పూట దొంగతనాల నివారణకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారని తెలిపారు.

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2026 అదిరిపోయే ప్లాన్ !

image

HYDలో నిర్వహించనున్న లిటరరీ ఫెస్టివల్ ఈసారి వినూత్నంగా ‘ట్రెజర్ హంట్’ను ప్లాన్ చేసింది. JAN 11న ఉ.6 గంటలకు ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఈ కార్యక్రమం మొదలవుతుంది. నలుగురు సభ్యులతో కూడిన టీమ్(ఒక మహిళ, చిన్నారి తప్పనిసరి) క్లూ పాయింట్లను ఛేదిస్తూ సాహిత్య ప్రియులు నగర అన్వేషణ చేయనున్నారు. సాహిత్యంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా ఈ అడ్వెంచర్‌ను రూపొందించారు. HLF ఈనెల 24-26 వరకు హైటెక్ సిటీలో జరగనుంది.

News January 4, 2026

FLASH.. హైదరాబాద్ శివారులో మహిళపై అత్యాచారం

image

ఇబ్రహీంపట్నం పరిధి యాచారం మండలంలో దారుణం చోటుచేసుకుంది. తమ్మలోనిగూడలోని కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మహిళపై సూపర్వైజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సూపర్వైజర్‌గా పనిచేస్తున్న నందివనపర్తికి చెందిన సాయి సదరు కూలీ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి తెలిపారు.

News January 4, 2026

HYDలో రెండు రోజుల్లో 327 మందిపై కేసులు

image

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. జనవరి 2, 3న చేపట్టిన తనిఖీల్లో మొత్తం 327 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిలో 263 మంది బైకర్లు, 25 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News January 4, 2026

GHMCలో పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత..?

image

GHMC పరిధిలో ఆస్తి పన్ను మదింపు అధికారుల అధికారాలపై స్పష్టత వచ్చింది. 10 వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న భవనాల పన్ను వ్యవహారాలను డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. అంతకు మించి విస్తీర్ణం ఉన్నా లేదా ఐదేళ్ల కంటే పాత బకాయిల సర్దుబాటు చేయాలన్నా నేరుగా జోనల్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. చిన్నచిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ చేస్తారు కానీ పెద్ద ప్రాపర్టీల లెక్కలన్నీ జోనల్ స్థాయిలోనే తేలనున్నాయి.

News January 4, 2026

UPDATE.. HYD: అగర్ ప్లేట్స్ తయారీకి జీవాల రక్తం !

image

నాగారంలో పోలీసుల దాడిలో పట్టుబడిన జీవాల <<18758795>>రక్తం సేకరణ<<>> వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్‌లో బ్యాక్టీరియా పెంపకానికి వాడే ‘అగర్ ప్లేట్ల’ తయారీ కోసం మేకలు, గొర్రెల రక్తం వాడుతున్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోషకాలు కలిగిన ఈ రక్తం ద్వారా కష్టతరమైన బ్యాక్టీరియాను పెంచుతారని నిపుణులు చెబుతున్నారు. హిమోలిసిస్ ప్రక్రియ కోసం రక్తాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనిపై విచారణ జరుగుతోంది.

News January 4, 2026

ముగిసిన GHMC విభజన.. Feb 9న CM గ్రీన్ సిగ్నల్!

image

GHMC కొత్త అధ్యాయం మొదలైంది. 3 కార్పొరేషన్ల ప్రక్రియ 100% పూర్తైంది. ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన సైలెంట్‌గా క్లోజ్ చేసేశారు. 300 వార్డులకు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులూ ముగిశాయి. ముగ్గురు సిటీ ప్లానర్లు వెంకన్న (శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), ప్రదీప్ కుమార్ (మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్), శ్రీనివాస్ (చార్మినార్, ఖైరతాబాద్, 6 జోన్లు)కు GHMC బాధ్యతలు అప్పగించింది.