Hyderabad

News June 3, 2024

రేపే RESULTS.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?

image

లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో పేరణి ఆంధ్ర నాట్యం, కూచిపూడి కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ గురువు పవన్, సంధ్య ఆధ్వర్యంలో పేరణి, ఆంధ్ర నాట్య అంశాలను కళాకారులు ప్రదర్శించారు. వినాయక కౌతం, మెలప్రాప్తి, శబ్దపల్లవి, శృంగనర్తనం, కుంభ హారతి, జయజయోస్తు తెలంగాణ, తిల్లాన, మామవతు, శ్రీ సరస్వతి, హారతి అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News June 3, 2024

HYD: పోలీసుల భారీ బందోబస్తు

image

లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు మోహరించి చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ కౌంటింగ్ సెంటర్లను 24/7 నిఘా నేత్రాలతో పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

News June 3, 2024

HYD: విశేషంగా ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ప్రదర్శనలు కళా ప్రియులను అలరించాయి. నాట్య గురువుల విద్యారావు, స్మితా మాధవ్, అర్చన మిశ్రా, సౌందర్యకౌశిక్ శిష్య బృందాలు చక్కటి హావ భావాలతో లయాత్మకంగా నృత్యం చేసిన తీరు నయనానందకరంగా సాగింది.

News June 3, 2024

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 23 రౌండ్ల లెక్కింపు

image

చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా చేవెళ్లలో 71.83% పోలింగ్ నమోదు కాగా… అతి తక్కువ శేరిలింగంపల్లిలో 43.91 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 23 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ శశాంక తెలిపారు.

News June 3, 2024

HYD: మండీ బిర్యానీ తిని 10 మందికి అస్వస్థత

image

మండీ బిర్యానీ తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘట్‌కేసర్ ఎస్ఐ రాము తెలిపిన వివరాలు.. భూపాలపల్లికి చెందిన ఉషారాణి(22), మహేశ్(25), అశోక్, చందు, మౌనిక, రేణుకతో పాటు నలుగురు చిన్నారులు ఇటీవల HYDకు కారులో వచ్చి ఘట్‌కేసర్‌‌లోని స్థానిక అరేబియా మండీలో బిర్యానీ తిన్నారు. అనంతరం వారంతా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉషారాణి తండ్రి నరసింహచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 3, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి మనవడితో సరదాగా గవర్నర్

image

సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.

News June 3, 2024

HYD: మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా? 

image

HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా కామెంట్ చేయండి.
SHARE IT 

News June 2, 2024

HYD: ప్రొ.జయశంకర్ ఆ జన్మ తెలంగాణ వాది: KCR

image

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆ జన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని BRS అధినేత కేసీఆర్‌ అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అప్పట్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్‌ అసెంబ్లీలో అన్నారని చెప్పారు.

News June 2, 2024

HYD: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు.