Hyderabad

News January 3, 2026

HYD: లీకేజీలను గుర్తించేంచుకు ‘రోబోటిక్’ టెక్నాలజీ

image

HYDలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గత రెండేళ్లలో అందిన ఫిర్యాదులను విశ్లేషించి, కలుషిత నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు నెలల్లోగా పాత పైప్‌లైన్లను మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. లీకేజీలను త్వరితగతిన గుర్తించేందుకు ‘రోబోటిక్ టెక్నాలజీ’ని వాడుతున్నారు. ఫిర్యాదులను ‘జీరో’ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు.

News January 3, 2026

లింగంపల్లి-ఉప్పల్: ​నిధుల కరవు.. అధికారాల పరువు!

image

శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా అతుకుల రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలే దర్శనమిస్తున్నాయి. సుమారు రూ. 14,725 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రతి వానాకాలం వేలాది కుటుంబాలు ముంపులోనే బతుకుతున్నాయి. విచిత్రమేంటంటే.. ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేసే అధికారం లేదు. అంటే, ఒక చిన్న డ్రైనేజీ కాలువ పూడిక తీయాలన్నా పైస్థాయి నుంచి <<18752122>>పచ్చజెండా<<>> రావాల్సిందే.

News January 3, 2026

హైదరాబాద్ చుట్టూ ‘నరక’ కూపాలు!

image

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మెట్రో రైళ్లే అనుకుంటున్నారా? నగరం చుట్టూ కొత్తగా చేరిన ఆ 27 మున్సిపాలిటీల (ULBs) వైపు వెళ్తే.. ‘అభివృద్ధి’ అనే మాటకే అర్థం మారిపోతోంది! 1,324 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్తులో ఇవి మురికివాడలుగా మారతాయా? అన్న భయం వేస్తోంది.

News January 3, 2026

HYD: మూడు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే ప్లాన్

image

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని గాంధీభవన్ వర్గాలు నేతలకు దిశానిర్దేశం చేశాయి. జూబ్లీహిల్స్ గెలుపు స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను వివరించాలని అధిష్ఠానం సూచించింది. అధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి, నగర రాజకీయాలపై పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

News January 3, 2026

HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

image

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.

News January 3, 2026

BIG BREAKING: HYDలో పోరాటానికి సిద్ధమైన BRS

image

GHMC డీలిమిటేషన్‌ మీద BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్‌తో విభజన చేయడం ఏంటని నిలదీస్తున్నారు. సికింద్రాబాద్‌ ప్రత్యేక కార్పొరేషన్‌ సాధించేందుకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని తలసాని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. జంట నగరాలను ఇష్టం వచ్చినట్లు విడదీసి, ప్రజల మనోభావాల తోటి ఆడుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు BRS పోరాటం చేస్తుందని తలసాని పేర్కొన్నారు.

News January 3, 2026

హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ కార్గో టన్నెల్స్

image

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్ బాస్. ట్రాఫిక్ జామ్‌లు చూసి తల పట్టుకుంటున్నారా? అందుకే NHAI ఒక క్రేజీ స్కెచ్ వేసింది. మన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కుల నుంచి భారీ వాహనాలను నేరుగా పంపేందుకు ‘అండర్‌గ్రౌండ్ కార్గో టన్నెల్స్’ నిర్మించబోతున్నారు. అంటే రోడ్డుపైన మనం రయ్యిమని దూసుకుపోవచ్చు. భారీ కంటైనర్లు మాత్రం నేల లోపలి నుంచే సైలెంట్‌గా వాటి డెస్టినేషన్‌కి వెళ్తాయి.

News January 3, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇద్దరి మధ్య 2-2-2 Bonding

image

HYD బిజీ లైఫ్‌లో ప్రేమకు సమయం దొరకడం దంపతులకు కష్టమవుతోంది. వీరికి ‘2-2-2 రూల్’ కొత్త దారి చూపిస్తోందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక డేట్‌, 2 నెలలకు ఓ వీకెండ్‌ ట్రిప్, 2 ఏళ్లకు ఒక దీర్ఘ విహారం కలిసి చేయాలనే ఈ సూత్రం అనుబంధాన్ని బలపరుస్తుంది. కలిసి గడిపే సమయం పెరగడంతో భావోద్వేగ అనుబంధం బలపడుతుందనేది 2-2-2 సందేశం. చిన్న ప్రణాళికలతో పెద్ద మార్పు సాధ్యం అంటున్నారు.

News January 3, 2026

దద్దరిల్లనున్న హైదరాబాద్

image

సంక్రాంతి వస్తే సిటీలో పతంగ్ ఎగరాల్సిందే. గల్లీలో పెద్ద బిల్డింగ్ ఒక్కటి ఉంటే చాలు. చరాక్‌కు షాదీ, మాంజా చుట్టి బిల్డింగ్ ఎక్కాల్సిందే. ఆకాశంలో పోటీ పడుతోన్న గాలిపటాలు చూసిన ఆ క్షణం వైబ్ వేరు. పేంచ్‌లు వేస్తూ గాలిపటాలతో యుద్ధం చేస్తుంటారు. దోస్తులంతా కలిసి చేసుకునే దావత్ మామూలుగా ఉండదు. మందు, మాంసంతో బలగం చేసే సందడి జాతరను తలపిస్తుంది. ‘కాటే పతంగ్’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.

News January 3, 2026

హైదరాబాద్‌లో కొత్త జిల్లా ఇదే?

image

ఏంది భయ్యా.. మన జిల్లా మారుతుందంట కదా?.. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. పరిపాలనను పరుగులు పెట్టించేందుకు GHMC ప్రాతిపదికన జిల్లాల రీ-ఆర్గనైజేషన్‌కు స్కెచ్ వేస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులను చెరిపేసి, ఆరు జోన్ల ఫార్ములాతో కొత్త రూపు ఇవ్వాలని చూస్తున్నారు. ఉప్పల్‌ను మల్కాజిగిరిలో కలిపి ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్?